శ్రీ మదగ్ని మహాపురాణము - 10 / Agni Maha Purana - 10


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 10 / Agni Maha Purana - 10 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 4

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. వరాహావతార వర్ణనము - 1 🌻


అగ్ని దేవుడు పలికెను : పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను. యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.

హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను. విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను. పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.

విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను. బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.

దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 10 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - Manifestations of Viṣṇu as the Boar - 1 🌻



Agni said:

1. I describe (unto thee) the manifestation as a Boar (which) removes (one’s) sins. Hiraṇyākṣa[1] was a demon chief. He conquered the celestials and got established in the heavens.

2. Viṣṇu being praised by the celestials (who had) gone (to him), (he) assumed the form as Yajñavarāha (boar). Having killed that demon along with the (other) demons (he made the earth) devoid of thorns (difficulties).

3-4. (That) Hari, the protector of righteousness and the celestials (then) disappeared. Then (the demon) Hiraṇyakaśipu[2], brother of Hiraṇyākṣa after conquering the celestials (was grabbing a share of the offerings) exercised control over all the celestials. (Viṣṇu) assumed the form of Narasiṃha (human body with lion’s face) (and) killed him along with the (other) demons.

5-7. (He) re-established the celestials in their original places and was praised by the celestials. Once in the battle between the celestials and the demons, the celestials were defeated by (demon) Bali[3] and other demons (and) were driven away from the heaven (and) sought refuge in Hari (Viṣṇu). Having given refuge to the devas he being praised by Aditi (wife of the latter) (and mother of the celestials) and Kaśyapa (a sage) became a Dwarf (as a son) of Aditi (and) went to the sacrifice (performed by Bali) (and) recited the Vedas at the royal gates of Bali the sacrificer.

8-9. Having heard him reciting the Vedas, the bestower of the wanted things (Bali) said to the Dwarf in spite of being obstructed by Sukra (the preceptor of the demons), “Whatever (you) desire I shall give (you)”. The Dwarf asked Bali, “Get (me) three feet of space for the sake of the preceptor. (Bali) said to him, “I shall give (you)”.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


24 Feb 2022

No comments:

Post a Comment