శ్రీ మదగ్ని మహాపురాణము - 53 / Agni Maha Purana - 53


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 53 / Agni Maha Purana - 53 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 19

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. కశ్యప వంశ వర్ణనము - 3 🌻


హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీని నంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగా ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.

బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు, జలములకు కరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు విష్ణువు, వసువులకు అగ్ని, మరుత్తులకు ఇంద్రుడు,

ప్రజాపతులకు దక్షుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు,

గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి,

వనస్పతులకు ప్లక్షము, అశ్వములకు ఉచ్ఛైఃశ్రవము ప్రభువలు తూర్పున సుధన్వ, దక్షిణమున శంఖపదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము ) చెప్పబడినది.

అగ్ని మహాపురాణమున ప్రతి సర్గవర్ణనమను ఏకోనవింశా ధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 53 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 19

🌻 The progeny of Kaśyapa - 3 🌻


22. All these (are) forms of Hari. Having installed Pṛthu as the ruler, Hari duly set apart kingdoms for others.

23. The moon (was made the king) of the twice-born and the plants, Varuṇa (as) the king of waters, Vaiśravaṇa (Kubera) (as) the king of kings, Viṣṇu (as) the lord of Suns.

24. Pāvaka (fire) as the king of Vasus; Vāsava (Indra) (as) the lord of Maruts and then Dakṣa (as the king) of Prajāpatis (patriarchs), Prahlāda (as) the ruler of demons.

25. Yama (was made) the king of manes, Hara (Siva) (as) the lord of goblins, Himavat (as the ruler) of mountains, the ocean (as) the lord of rivers.

26. Citraratha (was made the ruler) of Gandharvas, and then Vāsuki (as the ruler) of Nāgas, Takṣaka (as) the king of serpents, and then Garuḍa, among the birds.

27. The Airāvata (was made the ruler) among the lords of elephants, bull of the kine and the tiger, of the animals, (and) Plakṣa (the Indian fig-tree) (as) the lord of trees.

28. And Uccaiḥśravas (was made the ruler) among the horses.[6] Sudhanvan (son ofVairāja Prajāpati) became the regent of the east, Śaṅkhapād (the son of Kardama Prajāpati) (the regent) of the south, Ketumat (son of Rajas) as the protector of the waters (on the west), Hiraṇyaromaka (son of Parjanya Prajāpati) on the Saumya (the north).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


25 May 2022

No comments:

Post a Comment