నిత్య ప్రజ్ఞా సందేశములు - 326 - 21. భారతదేశానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది / DAILY WISDOM - 326 - 21. India has the Blessing of God


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 326 / DAILY WISDOM - 326 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ

🌻 21. భారతదేశానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది 🌻


భారతదేశానికి దేవుని ఆశీర్వాదం ఉంది. ఇది ఇతర దేశాల లాగా తన ఉనికిని కోల్పోలేదు, అంత సులభంగా కోల్పోయేలా కనిపించట్లేదు. భారతదేశం తాను చేసిన ఒక్క తప్పిదం వల్ల కొన్ని శతాబ్దాల పాటు దాని స్వాతంత్య్రాన్ని కోల్పోయి నష్టపోయింది. ఇది భౌతిక ఉనికి యొక్క విలువను త్రుణీకరించి, కేవలం అభౌతిక ఉనికికి చాలా విలువను ఇవ్వడం వలన అంటే, భౌతిక కర్మానుచరణను త్యజించి భగవంతుని భౌతిక సృష్టిని కించపరచడం వల్ల, ప్రాపంచిక శక్తుల చేత దాడి చేయబడింది. అవి దాడి చేసినప్పుడు దేవుడు సహాయం చేయడానికి రాలేదు. ఎందుకంటే భారతదేశ ప్రజలు దేవుణ్ణి రెండు భాగాలుగా విభజించారు- సృష్టికర్త మరియు సృష్టి
దేశం ఆర్థికంగా, సైనికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా నష్టపోయింది.

కానీ, తన ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల సమగ్రమైన ఏకత్వ అవగాహన లేనప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల అచంచల శ్రద్ధ ఉన్నందువల్ల భారతదేశ ఆత్మ, తన రక్షణ కోసం తన దగ్గర చెప్పుకోదగ్గవి ఏమి లేనప్పటికీ , తన ఎదుగుదల కోసం తాపత్రయ పడుతూ, ఇంకా మనుగడలోనే ఉంది. భారతదేశంలోని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు అతీతమైన సృష్టికర్త యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ప్రపంచాన్ని మరియు భగవంతుడిని సామరస్య స్థితిలోకి తీసుకురావడం అంత సులభమైన విషయమేమీ కాదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 326 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 21. India has the Blessing of God 🌻

India has the blessing of God, somehow. It has not died like other nations, and it does not appear that it is going to die easily. India has suffered due to one mistake that it has committed. It lost its independence for some centuries because it discredited the value of Earthly existence, and gave too much credit to a transcendental existence. That is, the love for God was not equally commensurate with the duty to the world, and so the worldly forces attacked, and God did not come to help because people segmented God Himself into two parts—the Creator and the created.

The country suffered economically, militarily, and even in its concept of spirituality. Yet, in its aspiration for the transcendent, though it was not conceived properly in an integral fashion (it was segmented because it was separated from the world's existence), the intensity of the longing for the transcendent was such that its soul is still surviving, though economically, and from the point of view of defense forces, it is not possessed of much that can be admired. Most of the religious people in India asserted the importance of the transcendent Creator, and it was not so easy to bring together into a state of harmony the world and God.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


16 Aug 2022

No comments:

Post a Comment