దేవాపి మహర్షి బోధనలు - 19
🌹. దేవాపి మహర్షి బోధనలు - 19 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 10. సిద్ధాంతము - ఆచరణ 🌻
ఆచరణకు సిద్ధాంతము బీజము. సిద్ధాంతమునకు ఆచరణ శిశువు. ఒకటి బీజము మరియొకటి వృక్షము. అటులనే సంకల్పమునకు మనస్సు తల్లి, మనస్సునకు సంకల్పము పుత్రుడు.
సంకల్పమునకు జ్ఞానము తల్లి, జ్ఞానమునకు సంకల్పము పుత్రుడు. పరిణామము చరిత్ర గర్భమునుండి వెలువడుచుండును. పరిణామము నుండి మరల చరిత్ర వెలువడుచుండును. సృష్టి అంతయు చర్వితచర్వణమే.
అనగా జరిగినదే మరల మరల జరుగుచుండును. కాని జరిగినపుడెల్ల పాతదిగ కాక కొత్తదిగ గోచరించును. దీనినే ఋషులు “నవ” అని పిలిచెదరు. ఎప్పుడును కొత్త దిగనే కొనిరాబడు చున్నది. కావున “నవనీత” మనిరి.
ప్రతిదినము నిద్రలేచుట, పనులు చేయుట, భుజించుట, మాటలాడుట, విశ్రాంతి గొనుటగా జరుగుచున్నను, ప్రతిదినము ప్రత్యేక దినముగ గోచరించుచున్నది కదా!
ఇట్లు సంకల్పముల నుండి ఆచరణములు, ఆచరణముల నుండి మరల సంకల్పములు అనంతముగ చక్రభ్రమణము చేయుచునే యుండును. అయిపోవుట ఏ స్థితి యందు ఉండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
Labels:
దేవాపి మహర్షి బోధనలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment