శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 196 / Sri Lalitha Chaitanya Vijnanam - 196


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 196 / Sri Lalitha Chaitanya Vijnanam - 196 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖


🌻196. 'సర్వజ్ఞా'🌻

సర్వమూ తెలిసినది శ్రీమాత అని అర్థము.

శ్రీమాత, సృష్టి ఎఱుక. సృష్టియందలి సమస్త ప్రాణికోటి యందును ఆమె ఎఱుకయే పని చేయుచుండును. ప్రాణులు, ఎఱుక తమదనుకొందురు. జీవుల యందలి ఎఱుక శ్రీదేవియే. ఆ ఎలుక ఆధారముగ జీవులు తమ తమ స్వభావములను బట్టి భావములను పొంది కార్యములను నిర్వర్తించుచుందురు. ఎఱుక లేనిదే భావన లేదు.

సర్వభావములకూ మూలము ఎఱుకయే. భావములు లేని ఎఱుకను తెలిసినవాడు తనయందు చైతన్య స్వరూపిణిగా శ్రీమాత ఎట్లున్నదో తెలియగలడు. స్వభావమునం దిమిడిన జీవులకు వారి గుణ సముదాయములనుబట్టి భావము లేర్పడుచుండును.

భావముల యేందే తిరుగాడువారు భావములకు మూలమైన ఎఱుకను గుర్తించ లేరు. సినిమా తెరపై బొమ్మలు ఎల్లపుడూ పడుచుండగా, బొమ్మలు లేని వెండితెర నూహించుట కష్టము. భావములు ఎక్కడనుండి పుట్టుచున్నవో దానిని గమనించుట ధ్యానముగ శ్రీకృష్ణుడు భగవద్గీత యందు తెలిపినాడు.

భావములు పుట్టుచున్న చోటును గమనించు మార్గమున క్రమముగ జీవుడు తనయందలి ఎఱుకను గుర్తించును. అట్లు తెలిసినవాడు ఆ ఎఱుకను అన్నిటి యందు దర్శించుటకు ప్రయత్నింప వలెను. ఆ ఎఱుకనుండియే సర్వమునూ పుట్టినవి.

ఎఱుక యందే సకల జీవవ్యాపారములు జరుగుచున్నవి. శ్రీమాత అందరి యందు తాను ఎఱుకగా యున్నది అని ఈ నామము తెలుపుచున్నది. అందువలన ఆమెకు సర్వమునూ తెలిసియే యుండును. ఆమెకు తెలియక సృష్టిలో జరుగున దేమియూ లేదు. ఆమెది సర్వజ్ఞత.

శ్రీమాత తత్త్వము మనయందు యుండుటవలననే ప్రతిమానవుడు “నేనున్నాను” అని భావించుచున్నాడు. ఎఱుకయే లేనిచో ఈ భావనయే లేదు. తానున్నాను అను భావన ఆధారముగ ఇతర భావనలు అల్లుకొన్నవి. ఈ భావములకు అతీతముగ మనయందున్నది శ్రీమాత.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 196 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Sarvajñā सर्वज्ञा (196) 🌻

She is omniscient. Only the Brahman alone can be omniscient. Muṇḍaka Upaniṣad (I.1.9) says “That Brahman, which is all-knowing in general way and which is also all-knowing in detail whose austerity is knowledge and from that (para) Brahman comes this (apara) Brahman and also such categories as name, form and food.”

The Upaniṣad specifically uses the word tapaḥ, meaning the highest form of meditation known as penance. Parā Brahman is the nirguṇa Brahman (without attributes) and aparā Brahman is saguṇa Brahman (with attributes).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Feb 2021

No comments:

Post a Comment