వివేక చూడామణి - 177 / Viveka Chudamani - 177
🌹. వివేక చూడామణి - 177 / Viveka Chudamani - 177 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 33. బంధనాలు -3 🍀
574. పుట్టుక, చావు లేనిది బ్రహ్మము. దానికి హద్దులు లేవు. అది పెనుగులాడే ఆత్మకాదు. అది విముక్తి తరువాత పొందేది కాదు మరియు విముక్తి పొందినది కాదు అది అంతిమ సత్యము.
575. నేను ఈ రోజు నీకు మరల మరల చెప్పుచున్నాను. నా స్వంత కుమారునిగా నిన్ను భావించుచున్నాను. ఈ గొప్పదైన, అరుదైన రహస్యము, అంతర్గత వేదాంతపరమైన పూర్తి అభిప్రాయము, వేద మూలము యొక్క సారము. నీవు విముక్తుడైన తరువాత సాధకుడివైన వ్యక్తిగా మరకలు తొలగించబడిన పరిశుద్దినిగా ఈ చీకటి ప్రపంచములో మానసిక పరమైన కోరికలు లేని వానిగా భావించుచున్నాను.
576. గురువు యొక్క ఈ మాటలను వింటూ, శిష్యుడు భక్తితో గురువు గారికి సాష్టాంగ నమస్కారము చేసి అతని అనుమతితో తన మార్గములో తాను విముక్తి పొందిన వానిగా ప్రయాణము సాగించినాడు.
577. గురువు గారు తన మనస్సును బ్రహ్మమైన అనంతాత్మలో నిమగ్నము చేసి, అందులో ఈదులాడుతూ ప్రపంచం మొత్తాన్ని పవిత్రము చేస్తూ, తన మనస్సులోని అన్ని విధములైన భేద భావాలను తొలగించుకున్నాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 177 🌹
✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 33. Attachments -3 🌻
574. There is neither death nor birth, neither a bound nor a struggling soul, neither a seeker after Liberation nor a liberated one – this is the ultimate truth.
575. I have today repeatedly revealed to thee, as to one’s own son, this excellent and profound secret, which is the inmost purport of all Vedanta, the crest of the Vedas – considering thee an aspirant after Liberation, purged of the taints of this Dark Age, and of a mind free from desires.
576. Hearing these words of the Guru, the disciple out of reverence prostrated himself before him, and with his permission went his way, freed from bondage.
577. And the Guru, with his mind steeped in the ocean of Existence and Bliss Absolute, roamed, verily purifying the whole world – all differentiating ideas banished from his mind.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment