మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -3 🌻

అవతారమూర్తి ధర్మసాధన మవలంబించుటలో లీలలు చూపి , ప్రవర్తనము ఇట్లుండవలయునని నేర్పును. అపుడెవడైన అహంకారి తాను దేవుడనని చెప్పుకొనదలచినచో తానును గురువు దగ్గర విద్యలు నేర్చుట మున్నగు మంచిపనులు చేసి తీరవలయును. చేసినచో వాని అహంకారము తీరి నిజముగా తాను ఆత్మస్వరూపుడని తెలుసుకొనును.

🌻 🌻 🌻

యమము అను సద్గుణమును నిర్లక్ష్యము చేయుటవలన జరుగు దండమే యమదండము. దీని ప్రయోజనము పునః పరిశుద్ధియే.

కూడబెట్టిన సంపదలతో సుఖములు అనుభవించుటయే సురలోకము. పుణ్యములకు ఫలితము దేహసౌఖ్యమైనపుడు యమ దండన తప్పదు. దానినుండి తప్పించుకొనుటకై ఇంద్రియములను, మనస్సును దమించుకొని పరబ్రహ్మమును చూడగోరువారు గడుసరులే గాని, మోక్షజీవులు కారు.

ఆత్మసమర్పణ మార్గము నవలంబించి అంతర్యామి అడుగుజాడల ననుసరించు వారే సర్వోత్తములని భాగవత మతము. ఇందు పరిసర జీవుల సద్గుణములే నారాయణుని కల్యాణ గుణములుగా తెలియబడును. మహనీయుల జీవిత సన్నివేశములను ప్రసంగించు కొనుటయే నారాయణ గుణకథ అను అమృత ప్రవాహము.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2022

No comments:

Post a Comment