మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 6 🌻
లోక కల్యాణమునకై పనిచేయుట సత్యమునందు జీవించుట అనియు, లోకోద్ధరణమునకై పనిచేయుట భ్రాంతిలో జీవించుట అనియు గ్రహించితిమి. అయినచో లోక కల్యాణమునకై పనిచేయుట వలన నాకేమి లభించును? అను ప్రశ్న కలి ప్రేరితుడై, జీవితమును వ్యాపారముగా మార్చుకొన్న వాని యందు ఉదయించును.
లోక కల్యాణమునకై ప్రకృతి, అందలి ఆకాశము, గాలి, నీరు, సూర్యచంద్రులు, నేల పని చేయుచుండుట మనకు కనపడుతున్న సత్యము. వీరికే పై ప్రశ్న పుట్టినచో ఈ జగత్తు యొక్క గమనము లేదు, మానవుని మనుగడ లేదు. ప్రకృతిని అనుసరించుటయే మానవుని కర్తవ్యము. దీనినే యజ్ఞార్థ కర్మ అందురు. ఇదియే నరజాతికి భద్రత చేకూర్చు భవ్యపథము.
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
19 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment