గీతోపనిషత్తు -293
🌹. గీతోపనిషత్తు -293🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 17-4
🍀 17-4. ప్రణవ స్వరూపుడు - భగవంతుని ప్రప్రథమ నామ రూపములు ఓంకారముగ ఋషులు దర్శించిరి. మరియొక ఉదాహరణముగ “మూడు వేదములు నేనే" అని దైవము పలికినాడు. ఋక్, సామ, యజుర్వేదములు మూడు ప్రధానమగు వేదములు. ఉచ్చారణ, ప్రాణ స్పందనము, కర్మ నిర్వహణము సృష్టి యందుకల మూల త్రికోణము. మన యందు సంకల్ప ముచ్చరింపబడగ, దానిని ప్రాణ బలముతో, బుద్ధి బలముతో నిర్వర్తించు చుందుము. ఇందు సంకల్పము ఋగ్వేదము. తాళ లయాత్మకముగ సాగు ప్రాణస్పందనము సామ వేదము. బుద్ధి బలముతో సంకల్పమును ప్రాణశక్తి సహాయమున నిర్వర్తించుట యజుర్వేదము. 🍀
పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17
తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.
వివరణము : నామము రూపము లేని భగవతత్త్వమునకు ఓంకారము ప్రథమనాదము. అందలి నాదము ప్రథమ రూపము. భగవంతుని ప్రప్రథమ నామ రూపములు ఓంకారముగ ఋషులు దర్శించిరి. మరియొక ఉదాహరణముగ “మూడు వేదములు నేనే" అని దైవము పలికినాడు. ఋక్, సామ, యజుర్వేదములు మూడు ప్రధానమగు వేదములు. ఉచ్చారణ, ప్రాణ స్పందనము, కర్మ నిర్వహణము సృష్టి యందుకల మూల త్రికోణము.
మన యందు సంకల్ప ముచ్చరింపబడగ, దానిని ప్రాణ బలముతో, బుద్ధి బలముతో నిర్వర్తించు చుందుము. ఇందు సంకల్పము ఋగ్వేదము. తాళ లయాత్మకముగ సాగు ప్రాణస్పందనము సామ వేదము. బుద్ధి బలముతో సంకల్పమును ప్రాణశక్తి సహాయమున నిర్వర్తించుట యజుర్వేదము. ఈ మూడును నిత్యము మన యందు జరుగుచు నుండును. సంకల్పములు మనయందు అవతరించుచు నుండును. వానిని ప్రాణబలము, బుద్ధిబలముతో నిర్వర్తించుచు నుందుము. సంకల్పము ఇచ్ఛాశక్తి స్వరూపము. ప్రాణము జ్ఞానశక్తి స్వరూపము. బుద్ధి క్రియాశక్తి స్వరూపము. ఓంకారము రూపమున ఈ మూడింటికిని బలము కూర్చి ఈశ్వరుడు సృష్టి నిర్వహణము చేయుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment