నిర్మల ధ్యానాలు - ఓషో - 303


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 303 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. 🍀


రేపు ఎప్పుడూ రేపే. ఈ రోజు కాదు. దాన్ని ఒక్కలాగే వుండాలని వూహించ కూడదు. అట్లా వూహించడం ప్రమాదకరం. రేపు ఎప్పుడూ ఈ రోజు కాదు. అందువల్ల నువ్వు చిరాకుపడతావు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఈ రోజులాగే రేపు జరిగితే నీకు విసుగు వస్తుంది. చిరాకు ఆనందం కాదు, విసుగు ఆనందం కాదు. భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోనీ. దానిపైన ఎట్లాంటి ఆశలూ పెట్టుకోకు. దాన్ని అజ్ఞాతమయిందిగానే వదిలిపెట్టు. అనూహ్యమయిందిగానే వదిలిపెట్టు. విషయాల్ని శాశ్వతమయినవిగా వుండేలా ప్రయత్నించకు. జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. తావో'ని బట్టి సాగాలి.

అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. కొత్త కాంతి, కొత్త జీవితం, కొత్త దైవత్వం ఆవిష్కారమవుతాయి. నిరంతరం ప్రేమ ప్రవహించే వ్యక్తి, దేనితోనూ ఘర్షించని వ్యక్తి విశాలమవుతాడు. ఆకాశమంత అవుతాడు. విశాలత్వంలో అస్తిత్వమంటే ఏమిటో అతనికి తెలిసి వస్తుంది. ఆ విశాలత్వమే అస్తిత్వం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment