శ్రీమద్భగవద్గీత - 326: 08వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 326: Chap. 08, Ver. 16

 

🌹. శ్రీమద్భగవద్గీత - 326 / Bhagavad-Gita - 326 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 16 🌴

16. ఆబ్రహ్మభువనాల్లోకా: పునరావర్తినోర్జున |
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

🌷. తాత్పర్యం :

భౌతికజగము నందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మమృత్యు భరితమైన దుఃఖప్రదేశములే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.

🌷. భాష్యము :

కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటివారు శ్రీకృష్ణుని దివ్యదామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగమున (కృష్ణభక్తిరసభావన యందు) పూర్ణత్వమును బడయవలసియే ఉండును.

దేవతాలోకములైన ఉన్నతలోకములను పొందినవారు సైతము జన్మ, మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నతలోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుచుందురు.

బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసెడి “పంచాగ్నివిద్య” యను యజ్ఞము చాందోగ్యోపనిషత్తు నందు ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తిరసభావనను ఆచరింపనిచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసివచ్చును.

ఉన్నతలోకములందు కృష్ణభక్తిభావనను కొనసాగించువారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయసమయమున ఆధ్యాత్మికజగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధరస్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానము నందు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి.

బ్రాహ్మణే సహ తే సర్వే సమ్ప్రా ప్తే ప్రతిసంచరే |
పరిస్యాన్తే కృతాత్మాన: ప్రవిశన్తి పరం పదమ్

“విశ్వప్రళయము సంభవించినపుడు కృష్ణభక్తిభావన యందు సంతతమగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికల ననుసరించి ఆధ్యాత్మికజగము నందలి వివిధలోకములను చేరుచుందురు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 326 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 16 🌴

16 . ā-brahma-bhuvanāl lokāḥ punar āvartino ’rjuna
mām upetya tu kaunteya punar janma na vidyate


🌷 Translation :

From the highest planet in the material world down to the lowest, all are places of misery wherein repeated birth and death take place. But one who attains to My abode, O son of Kuntī, never takes birth again.

🌹 Purport :

All kinds of yogīs – karma, jñāna, haṭha, etc. – eventually have to attain devotional perfection in bhakti-yoga, or Kṛṣṇa consciousness, before they can go to Kṛṣṇa’s transcendental abode and never return.

Those who attain the highest material planets, the planets of the demigods, are again subjected to repeated birth and death.

As persons on earth are elevated to higher planets, people on higher planets such as Brahmaloka, Candraloka and Indraloka fall down to earth.

The practice of sacrifice called pañcāgni-vidyā, recommended in the Chāndogya Upaniṣad, enables one to achieve Brahmaloka, but if, on Brahmaloka, one does not cultivate Kṛṣṇa consciousness, then he must return to earth.

Those who progress in Kṛṣṇa consciousness on the higher planets are gradually elevated to higher and higher planets and at the time of universal devastation are transferred to the eternal spiritual kingdom. Baladeva Vidyābhūṣaṇa, in his commentary on Bhagavad-gītā, quotes this verse:

brahmaṇā saha te sarve samprāpte pratisañcare
parasyānte kṛtātmānaḥ praviśanti paraṁ padam

“When there is devastation of this material universe, Brahmā and his devotees, who are constantly engaged in Kṛṣṇa consciousness, are all transferred to the spiritual universe and to specific spiritual planets according to their desires.”

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment