సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 15


🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 15 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. అభంగ్ - 15 🍀


ఏక్ నామ హరీ ద్వైత నామ దురీ!
అద్వైత కుసరీ విరళా జాణే!!

సమబుద్ధి మౌతా సమాన్ శ్రీహరీ!
శమ దమావరీ హరీ ఝాలా!!

సర్వా ఘటీ రామ్ దేహాదేహీ ఏక్!
సూర్య ప్రకాశక్ సహస్ర రశ్మీ!!

జ్ఞానదేవా చిలీ హరిపాఠి నేమా!
మాగిలియా జన్మా ముక్తి ఝాలో!!

భావము:

హరినామము ఏక తత్వము కానీ ద్వైత నామాలను దూరము చేసి అద్వైత మార్గమును చేపట్టిన వారు బహు అరుదుగా ఉన్నారు. అని తెలుసుకో..

సమ బుద్ధితో వీక్షించి అంతట సమానముగ శ్రీహరి ఉన్నాడు అని తెలుసుకున్న వెంటనే శమధమాలను అధిగమించి హరి రూపము అయిపోతావు. సూర్యుడు ఒక్కడే కిరణాలు అనేకముగ ఉన్నట్లు దేహమందు దేహిగ సర్వ ఘటాలలో రామ తత్వము ఒక్కటే ఉన్నది.

హరి పాఠనేమమును చిత్తమునందు నిలిపి పఠించే వారి వెనుకటి జన్మలు ముక్తి కాగలవని జ్ఞానదేవులు తెలిపినారు.

🌻. నామ సుధ -15 🌻

హరి ఒక్కడే హరి నామాలనేకము

ద్వైత నామాలను చేయుము దూరము

హరియే సమగ్ర అద్వైత తత్వము

ఎరిగిన భక్తులు బహు దుర్లభము

సమ బుద్ధితో యోచించుము

సమానము శ్రీహరియని గాంచుము

శమ దమాలు ఉడిగిన ఆనంతరము

మిగిలి యుందువు శ్రీహరి రూపము

సర్వ దేహాలలో రామ తత్వము

“దేహి దేహము ఏకరూపము”

సూర్యుడు ఒక్కడే కిరణాలనేకము

నామి ఒక్కడే నామాలనేకము

జ్ఞాన దేవునిది ఏక చిత్తము

నిరంతరము హరిపాఠ నేమము

పూర్వ జన్మ కర్మలు సహితము

ముక్తి నొందునని తెలిపెను వినుము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020

No comments:

Post a Comment