శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 158 / Sri Lalitha Chaitanya Vijnanam - 158


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 158 / Sri Lalitha Chaitanya Vijnanam - 158 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖



🌻158. 'నిర్మదా'🌻

మదరహితురాలు శ్రీదేవి అగుటచే నిర్మదా అని పిలువబడుచున్నది. జీవుడు ప్రత్యగాత్మ అగుటచే అతడు మదమును పొందు అవకాశమున్నది. శ్రీదేవి సదాశివునితో కూడి యుండుటచే ఆమెకు ఆ భావన యుండదు. మదము అజ్ఞాన చిహ్నము. సమర్థులు, అసమర్థులు కూడా అంతో యింతో మదము కలిగి యుందురు. తమనుగూర్చిన దురభిమానమే మదము కలుగుటకు కారణము. అభిమానముండవలెనే గాని దురభిమానముండరాదు.

మితిమీరిన అభిమానము తమపై తమకుండుట వలన మదమెక్కి ప్రవర్తింతురు. అసురుల మదమునకిదియే కారణము. మదము అసుర గుణము. అవకాశమును బట్టి దేవతలను కూడా ఈ గుణము ఆవరించగలదు. అప్పుడు వారు కూడా భంగపడుదురు. కానీ దేవతలు సహజముగ దైవీసంపత్తి కలవారగుటచే మదమావరించినను, భంగపడినపుడు తమ తప్పును తాము తెలుసుకొని శ్రీదేవినో లేక శ్రీమహావిష్ణువునో శరణాగతి జొచ్చెదరు.

మానవులలో కూడా దైవీస్వభావము కలవారు, ఆసురీ స్వభావము కలవారు యుందురు. దైవీస్వభావము కలవారు తమ తప్పులను తాము తెలుసుకొని వానిని సరిదిద్దుకొనుటకు దైవమును ఆశ్రయింతురు. ఆసురీ స్వభావము కలవారు తమ తప్పులను సమర్థించుకొనుచు పతనము చెందుచునుందురు. వారి నాశనమును వారే కొని తెచ్చుకొందురు. ఇట్టివారే దైవముపైనా గ్రహించుట, దూషించుట కూడ చేయుచు నుందురు.

శ్రీదేవి ఆరాధనము సక్రమముగా సాగినచో ఆరాధకులకు మదము తగ్గుట జరుగును. ఆరాధన పెరిగిన కొద్ది మదము పెరుగుట జరిగినచో ఆరాధన ఆసురీ మార్గమున ఉన్నదని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 158 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirmadā निर्मदा (158) 🌻

She is without pride. Mada means pride. When someone has something that others do not have, it gives rise to pride. She has everything and everything comes out of Her (hiranya garbha or the golden egg or womb.

It is the matrix of the imperishable substance, the Brahman. It is said to be the luminous 'fire mist' or ethereal stuff from which the universe was formed and generally applied to Brahma.

This is described in the Rig-Veda as born from a golden egg, formed out of the seed deposited in the waters when they were produced as the first modifications of the Self-existent.) There is no necessity for Her to become proud of something.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020

No comments:

Post a Comment