శ్రీ శివ మహా పురాణము - 725 / Sri Siva Maha Purana - 725


🌹 . శ్రీ శివ మహా పురాణము - 725 / Sri Siva Maha Purana - 725 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 09 🌴

🌻. శివుని యాత్ర - 2 🌻


అపుడు భగవాన్‌ బ్రహ్మ చేతి యందు కొరడాను బట్టి గుర్రముల నదలించి శివుని మాటచే ఆ శ్రేష్ఠరథమును నిలబెట్టెను (10). అపుడు బ్రహ్మ శ్రేష్ఠమగు ఆ రథమునందు కూర్చున్నవాడై మనో వేగ వాయు వేగములు గల, వేదరూపములైన, ఆ రథమునకు పూర్చబడి యున్న గుర్రములను తోలెను (11). మహావీరులగు ఆ రాక్షసుల యొక్క, ఆకసము నందుండే మూడు నగరములను లక్ష్యముగా చుసుకొని బ్రహ్మ మహేశ్వరునిచే అధష్ఠింపబడిన ఆ రథమును నడుపును (12). అపుడు మంగళకరుడగు రుద్ర భగవానుడు దేవతల వైపు చూచి 'నాకు పశుపతిత్వమును కల్పించినచో, నేను రాక్షసులను సంహరించెదను' అని పలికెను (13).

ఓ దేవశ్రేష్ఠులారా ! దేవతలకు మరియు ఇతర జీవులకు వేర్వేరుగా పశుత్వమును కల్పించినచో, ఆ రాక్షసులు సంహరింపబడెదరు. అట్లు గానిచో, ఆ రాక్షసవీరుల సంహరింపబడరు (14).


సనత్కుమారుడిట్లు పలికెను -

ధీమంతుడు, దేవదేవుడునగు శివుని ఆ మాటను విని అందరు పశుభావమును గూర్చి శంక గలవారై దుఃఖమును పొందిరి (15). దేవదేవుడు, పార్వతీపతి యగు శంభుడు ఆ దేవతల మనోగతము నెరింగి నవ్వి వారిని ఉద్దేశించి దయతో నిట్లనెను (16).


శంభుడు ఇట్లు పలికెను -

ఓ దేవశ్రేష్ఠులారా ! మీరు పశుభావమును పొందిననూ పతనమును పొందరు. పశుభావము నుండి విముక్తిని పొందే ఉపాయమును గురించి విని, ఆ విధముగా ఆచరించుడు (17). ఎవడైతే దివ్యమగు పాశుపత వ్రతమునాచరించునో, ఆతడు పశుత్వము నుండి విముక్తిని పొదగలడు. ఇది సత్యము. నేను ప్రతిజ్ఞను చుయుచున్నాను. గమనించుడు (18). ఓ దేవశ్రేష్ఠులారా ! మీరే గాక ఇతరులైననూ నా ఈ పాశుపతవ్రతము నాచరించినచో పశుత్వము నుండి విముక్తులగుదురనుటలో సందియము లేదు (19). ఎవడైతే జీవితకాలమంతయూ, లేదా పన్నెండు సంవత్సరములు, లేక ఆరు సంవత్సరములు, లేక మూడు సంవత్సరములు శుశ్రూషను చేయునో, వానికి పశుత్వము నుండి ముక్తి కలుగును (20). ఓ దేవ శ్రేష్ఠులారా ! కావున ఈ శ్రేష్ఠమగు దివ్యవ్రతము నాచరింపుడు. మీకు నిస్సంశయముగా పశుత్వమునుండి విముక్తి కలుగును (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 725🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 09 🌴

🌻 Śiva’s campaign - 2 🌻



Sanatkumāra said:—

10-12. But the lord touched the bridle and steadied the horses. Then Brahmā seated in the excellent chariot drove the excellent chariot with the velocity of mind and wind, at the bidding of the lord towards the three cities of the valiant Asuras. The cities were then in the sky. Lord Śiva was seated inside.

13. Then lord Śiva looked at the gods and said—“Give me the lordship of the animals. Then I shall kill the Asuras.

14. O excellent gods, the excellent Asuras can be killed only after assigning separate animalhood to the gods and others. Not otherwise.”


Sanatkumāra said:—

15. On hearing these words of the intelligent lord of the gods, they became dispirited growing suspicious of animalhood.

16. On knowing what was passing through their minds, Śiva, the lord of the gods, the consort of Pārvatī sympathised with the gods and laughingly said.


Śiva said:—

17. “O excellent gods, you will not fall even in your animalhood. Let it be heard, and let the process of release from animalhood be practised.

18. He who performs the divine rite of Pāśupata[1] will be released from animalhood. I promise this to you. Be attentive.

19. O excellent gods, there is no doubt about it that those who perform my Pāśupata rite will become liberated.

20. He who renders service perpetually or for twelve years, becomes relieved of animalhood.

21. Hence O excellent gods, perform this divine rite. You will be released from animalhood. There is no doubt about this.”


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment