🌹 . శ్రీ శివ మహా పురాణము - 886 / Sri Siva Maha Purana - 886 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴
🌻. శంఖచూడ వధ - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- తన సైన్యములో ప్రముఖభాగము నశించుటయు, తనకు ప్రాణముతో సమమైన వీరులు సంహరింప బడుటను గాంచి అపుడా దానవుడు మిక్కిలి కోపించెను (1). అతడు శంభునితో, 'నేను యుద్ధములో నిలబడి యున్నాను. నీవు కూడ నిలబడుము. వీరిని సంహరించుట వలన లాభమేమి గలదు? ఇపుడు నాఎదుట నిలబడి యుద్ధమును చేయుము' అని పలికెను (2). ఓ మునీ! ఆ దానవవీరుడు ఇట్లు పలికి దృఢనిశ్చయము చేసుకొని యుద్ధమునకు సన్నద్ధుడై శంకరుని ఎదుట నిలబడెను (3). ఆ దానవుడు మహారుద్రునిపై దివ్యములగు అస్త్రములను, బాణములను, మేఘము నీటిని వలె, వర్షించెను (4). దేవతలలో, గణములలో గల శ్రేష్ఠులందరు కూడ ఊహింప శక్యము కాని, కంటికి కానరాని, భయంకరములగు అనేక మాయలను ఆతడు ప్రదర్శించెను (5). అపుడు శంకరుడు వాటిని గాంచి గొప్ప దివ్యమైన, మాయలన్నింటినీ నశింపజేయు మహేశ్వరాస్త్రమును అవలీలగా ప్రయోగించెను (6). అపుడు దాని తేజస్సుచే వాని మాయలన్నియు శీఘ్రమే అదృశ్యమగుటయే గాక వాని దివ్యాస్త్రములు కూడ తేజోవిహీనములాయెను (7).
అపుడా యుద్ధములో మహాబలుడగు మహేశ్వరుడు ఆతనిని వధించుటకై గొప్ప తేజశ్శాలురకు కూడ నివారింప శక్యము గాని శూలమును వెంటనే పట్టుకొనెను (8). అదే కాలములో ఆ ప్రయత్నమును అడ్డుకొనుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను : ఓ శంకరా! ఇపుడు నాప్రార్తనను విని శూలమును ప్రక్కన పెట్టుము (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 886 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴
🌻 Śaṅkhacūḍa is slain - 1 🌻
Sanatkumāra said:—
1. On seeing the important and major portion of his army killed, including heroes as dear to him as his life, the Dānava became very furious.
2. He spoke to Śiva. “I am here standing ready. Be steady in the battle. What is it to me, if these are killed? Fight me standing face to face”.
3. O sage, after saying this and resolving resolutely the king of Dānavas stood ready facing Śiva.
4. The Dānava hurled divine missiles at him and showered arrows like the cloud pouring rain.
5. He exhibited various kinds of deceptive measures invisible and inscrutable to all the excellent gods and Gaṇas and terrifying as well.
6. On seeing that, Śiva sportively discharged thereat the excessively divine Māheśvara missiles that destroy all illusions.
7. All the illusions, were quelled rapidly by its brilliance. Though they were divine missiles they became divested of their brilliance.
8. Then in the battle, the powerful lord Śiva suddenly seized his trident which could not be withstood even by brilliant persons, in order to slay him.
9. In order to prevent him then, an unembodied celestial voice said—“O Śiva, do not hurl the trident now. Please listen to this request.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment