సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 9


🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 9 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ



🍀. అభంగ్ - 9 🍀


విష్ణువీణ్ జప్ వ్యర్ద్ త్యాచే జ్ఞాన్!
రామకృష్ఠీ మన్ నాహీ జ్యాచే!!

ఉపజోని కరంటా నేణే అద్వైత వాటా!
రామకృషీ పైఠా కైసేని హెయ్ ?!!

ద్వైతా చీ ఝాడణీ గురువీణ జ్ఞాన్!
తయా కైచే కీర్తన ఘడేల్ నామీ!!

జ్ఞానదేవ మణే సగుణ హే ధ్యాన్!
నామపాఠమౌన్ ప్రపంచాచే!!


భజన

II రామకృష్ణ హరే జయజయ రామకృష్ణ హరే ||


భావము:

విష్ణువుతో సంబంధము లేని జపము మరియు జ్ఞానము వ్యర్థము. వీరికి రామ కృష్ణులందు మనస్సు లగ్నం కాదు. ఈ మౌడ్యులు అద్వైత మార్గమున పయనించ జాలరు. కావున వీరికి ఏ విధముగ రామ కృష్ణుల కృప లభించగలదు.?

గురుబోధకానిదే ద్వైతము తొలగదు, జ్ఞానము కలుగదు. మరి భగవంతున్ని కీర్తించే భాగ్యము ఎలా సాధ్యము కాగలదు? ప్రపంచ విషయాల ఆసక్తి వదిలి వేసి సగుణ రూపాలను ధ్యానము చేయుచు మౌనముగా నామ పఠన చేయవలెనని జ్ఞానదేవులు అన్నారు.


🌻. నామ సుధ -9 🌻

విష్ణువును వీడి పోయిన జపము

వ్యర్థమగును వారి జ్ఞానము

రామకృష్ణులలో లేదు విశ్వాసము

మదిలో నిలవదు హరినామము

జన్మించి అయినది దుర్భాగ్యము

తెలుసుకోడు అద్వైత మార్గము

ఎరుగ జాలడు నామ తత్త్వము

రామకృష్ణ కృప ఎలా ప్రాప్తము?

ద్వైతము తొలగక పూర్వము

గురువు లేకనే జ్ఞానము

నామ కీర్తన చేసే భాగ్యము

ఎలా అవుతుంది సాధ్యము?

జ్ఞానదేవుని ప్రబోధము

సగుణ రూపమునే ధ్యానము

ప్రపంచ విషయంలో మౌనము

నామమునే పఠనము చేయుము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020

No comments:

Post a Comment