శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 152 / Sri Lalitha Chaitanya Vijnanam - 152


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 152 / Sri Lalitha Chaitanya Vijnanam - 152 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖



🌻152. 'నిష్కారణా'🌻

కారణమేమియు లేకయే సృష్టి నిర్వహించునది శ్రీమాత. శ్రీమాత సృష్టి నిర్మాణము చేయుటకు వ్యక్తిగతముగా కారణ మేమియు లేదు. తన కోసము కాక జీవుల కొఱకు సృష్టి నిర్మాణము గావించు చున్నది. సృష్టి నిర్మాణము చేయుటలో ఆమె కొరుగునది ఏమియు లేదు. సృష్టి, స్థితి, లయములను జీవుల కొఱకే గావించు చున్నది. తాను ఆనందస్వరూపిణి. అట్టి ఆనందము కొఱకే జీవులు కూడ ప్రయత్నించుచున్నారు.

జనన మరణ చక్రముల పడుచు ఆనందము కొఱకై అన్వేషణము గావించువారు జీవులు. వారికి, వారి వారి పరిమణాములను బట్టి దేహములను అందించుచు, లోకములను సృష్టించుచు శాశ్వతముగా ఉండునది శ్రీమాత. ఆమె వరకు ఆమె నిష్కారణమే. కాని ఆమె కారణముగ సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి. ఆమె లేనిచో జీవులకు చైతన్యమే లేదు. త్రిగుణములు లేవు. దేహములు లేవు. తామున్నామని కూడ వారికి తెలియుట శ్రీమాత వలననే. కారణము లేకయే ఇతరుల శ్రేయస్సు కొఱకు వర్తించువారు యోగులు.

ఋషులు, సిద్ధులు, దేవతలలో కొందరు ఇట్లు శ్రీదేవి వలె సృష్టి జీవులకు తోడ్పాటు గావించుచున్నారు. ఇట్టి నిష్కారణు లందరూ దేవి సైన్యమే. వీరి జీవితము యజ్ఞార్థము. ప్రతిఫలాపేక్ష లేక ఇతరుల శ్రేయస్సునకు పనిచేయుట యజ్ఞము. అట్టి యజ్ఞముగ జీవితమును నిర్వర్తించుకొనుట దేవీ సైన్యమున చేరుటకు అర్హత, స్వార్థజీవితము నుండి నిస్వార్థము, శ్రేయోదాయకము అగు జీవనమునకు తమను తాము మలచుకొనుట సాధన.

“యజ్ఞార్థమ్ కురు కర్మాణి” అని శ్రీకృష్ణుడు శాసించుటలోని పరమార్ధము ఇదే. యోగి జనులకు, యోగసాధకులకు శ్రీదేవి సాన్నిధ్యమే గమ్యము. జీవులకు, సృష్టికి ఆమె ఆధారము, కారణము. ఆమె మాత్రము 'నిష్కారణ'యే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 152 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj



🌻 Niṣkāraṇā निष्कारणा (152)🌻

She is without cause. Kāraṇa means that which is invariably antecedent to some product. She is beyond descendance yet another quality of the Brahman. But the universe descends from Her.

Śvetāśvatara Upaniṣad (VI.9) says “There is none in this world who is His master or who governs Him, and here is nothing by which He can be identified. He is the cause of all. He is also the lord of the jīva (soul), who is the lord of the sense organs. No one is His creator and no one is His controller”.

She is invoked in Śrī Cakra by addressing Her as kāranānanda vigrahe (कारनानन्द विग्रहे).It means that She is the blissful elementary matter for manifestation of the universe. Therefore, She is the cause for the universe and there is no cause for Her.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020

No comments:

Post a Comment