మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సాధన యొక్క రెండు తరగతులు 🌻

ఈ రెండు మార్గములలో మొదటి మార్గము వారికి పొరపాటులున్నచో పతనము తప్పదు. ఎంత తెలిసిన వారైనను నిర్ణయము తమది అయినపుడు తమ‌ పొరపాట్లకు తామే బాధ్యులు. ఈ పొరపాట్లను సర్దుకుని దైవమునకు తమ యెడ అనుకూల్యము కలిగించుకొను యత్నముండును.

ఇక రెండవ తరగతి వారు పొరపాట్లు చేసినచో బాధ్యత తమదికాదు. కనుక వారి మార్గమున పతనము లేదు. ఈ ఇరు మార్గముల వారికిని క్రమశిక్షణ విషయమున, కర్తవ్య నిర్వహణము విషయమున సాధనమొక్కటే! అది లేనిచో రెండు‌ సంప్రదాయముల వారికిని తిరోగతియే గాని పురోగతి లేదు.

కర్తవ్యమును నిర్వహించి పరిపూర్ణతను ఆర్జించుకున చూచువారు మొదటి తరగతి వారు. కర్తవ్యము నిర్వహించుకొని దానిని భగవదర్పితముగా విడిచిపెట్టువారు రెండవ తరగతి వారు. ఈ రెండు తరగతుల వారును వరుసగా జిజ్ఞాసువులు, ముముక్షువులు అనబడుదురు.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


29 Nov 2021

No comments:

Post a Comment