శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 2




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 455. 'హంసినీ' - 2 🌻


శ్వాస యందలి ఉచ్ఛ్వాసను ఏకాగ్రతతో గమనించినచో 'సో' అను శబ్దము వినిపించును. అట్లే నిశ్వాసను గమనించినచో 'హం' అను శబ్దమును గమనించవచ్చును. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసలపై పూర్ణముగ దీర్ఘకాలము లగ్నము కావించినపుడు శ్వాస మూలమైన స్పందనమునకు మనస్సు చేరును. ఇట్లు చేరుటను అంతర్ముఖ మగుట అందురు. మనస్సు ఇట్లు అంతర్ముఖమైనపుడు స్పందనము కూడ ద్వయాక్షర మంత్రమగు 'సోం హం' అను మంత్రమును శబ్దించు చున్నట్లుగ కనిపించును. శ్వాస శబ్దము, స్పందన శబ్దము సో హం. 'సో' అనినపుడు వ్యాకోచము చెందుట, 'హం' అనునపుడు సంకోచము చెందుట గమనింపవచ్చును. ఇచ్చట అనుట అనగా జరుగుటయే. స్పందనము సంకోచ వ్యాకోచ ప్రజ్ఞ. దాని ననుసరించియే శ్వాస కూడ సంకోచ వ్యాకోచమై జరుగుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 455. 'Hamsini' - 2 🌻


If you concentrate on breathing and exhalation, you will hear the sound 'so'. Similarly, if you observe the breath of inhalation, you will notice the sound 'hum'. When the mind is fully engaged with the inhales and exhales, the mind reaches the response which is the source of the breath. Such a joining is called an introspection. When the mind is thus introverted, the response also seems to be like reciting the two-syllable mantra 'Som Ham'. The sound of breathing, the sound of response is so hum. It can be observed that 'So' is expanded and 'Hum' is contracted. To say, here, means to happen. Response is the pragnya of contraction and expansion. Following it, the breathing is also going on contraction and expansion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment