శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-2🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🌻 308-2. 'రాజీవలోచనా' 🌻
కన్నులు జీవ చైతన్యమునకు ముఖద్వారములు. జీవులు ఒకరి నొకరు కన్నులలోనికి చూచియే పలుకరించుకొను చుందురు. ఇరువురి జీవుల మధ్య ప్రధానముగ కన్నుల ద్వారముననే చైతన్యము పరస్పరము వ్యవహరించుట జరుగును. కన్నులే జీవ చైతన్యమునకు ముఖ ద్వారములు. సర్వ ప్రపంచమును కన్నులతోనే దర్శింతుము. దివ్య లోకముల దర్శనము కూడా దివ్యమగు కన్నుల ద్వారముననే కలుగును.
విచ్చుకున్న కన్నులు సమస్తమును దర్శించగలవు. ఆ దర్శనమున పారదర్శకత్వ ముండును. అమ్మ కన్నులు పారదర్శకములు. పారమును చూడగలవు. పరమును చూచు కన్నులు గనుక పరతత్త్వమును ప్రసరింప జేయుచుండును. పరతత్త్వమును కోరిన జీవులకు ప్రసాదించు చుండును. అమ్మ కన్నులను వర్ణించుట కాళిదాసాది మహాకవులకు కూడ అసాధ్యమైనది. రాజీవ మనగా చేప అని కూడ అర్థమున్నది.
రాజీవలోచనములు అనగా చేప ఆకారమున నుండు కన్నులు. అమ్మకు 'మీనాక్షి' అని మరియొక నామ మున్నది. అది తరువాతి నామములలో వివరింప బడును. రాజీవ మనగా జింక అని అర్థ మున్నది. కావున జింక కన్నుల వంటి కన్నులు కలది అని కూడ అర్థము. జింక కన్నులలో చంచలత్వము, బెదరు కనిపించును. బెదరుచూపులు సౌమ్యతను, స్త్రీత్వమును ప్రకటించును. సౌమ్యత్వము సత్వగుణమును ప్రకటించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 308-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀
🌻 308-2. Rājivalocanā राजिवलोचना (308) 🌻
The intended meaning of this nāma is that Her eyes are not comparable to anything. Her eyes are full of grace and compassion. By mere winking of eyes, She performs three actions of creation, sustenance and destruction (nāma 281). Rājiva also means king and rājivalocanā means eyes of one who is dependent on king. It has been already seen that Śiva is known as Rājarāja and dependent refers to His devotees. She blesses His devotees with the grace of Her eyes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment