1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం 11-సెప్టెంబర్-2021 ఋషి పంచమి శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 252 🌹
3) 🌹. శివ మహా పురాణము - 451🌹
4) 🌹 వివేక చూడామణి - 128 / Viveka Chudamani - 128🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -80🌹
6) 🌹 Osho Daily Meditations - 70🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 128🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఋషి పంచమి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*🌻 Happy Ganesh Chavithi to All Friends.🌻*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. సప్తర్షి స్మరణం 🍀*
కశ్యపోఽత్రిర్భరద్వాజో విశ్వామిత్రోఽథ గౌతమః |
జమదగ్నిర్వసిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతాః |
ఓం సప్త ఋషిభ్యో నమః |
🌻 🌻 🌻 🌻 🌻
11 శనివారం, సెప్టెంబర్ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
తిథి: శుక్ల పంచమి 19:38:10 వరకు తదుపరి శుక్ల షష్టి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: స్వాతి 11:23:52 వరకు తదుపరి విశాఖ
యోగం: ఇంద్ర 14:40:11 వరకు తదుపరి వైధృతి
కరణం: బవ 08:47:48 వరకు
వర్జ్యం: 16:37:32 - 18:07:24
దుర్ముహూర్తం: 07:41:56 - 08:31:08
రాహు కాలం: 09:08:02 - 10:40:17
గుళిక కాలం: 06:03:31 - 07:35:47
యమ గండం: 13:44:48 - 15:17:03
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 03:09:50 - 04:39:30 మరియు
25:36:44 - 27:06:36
సూర్యోదయం: 06:03:31, సూర్యాస్తమయం: 18:21:34
వైదిక సూర్యోదయం: 06:07:03
వైదిక సూర్యాస్తమయం: 18:18:01
చంద్రోదయం: 09:58:48, చంద్రాస్తమయం: 21:43:13
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: తుల
ఆనందాదియోగం: సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
11:23:52 వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం
పండుగలు : ఋషి పంచమి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -252 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 1-1
*🍀 1. అనసూయత్వము-1 - అసూయ ఉన్న హృదయము నందు జ్ఞాన విజ్ఞానములు నిలువవు. లోపల, వెలుపల వశించియున్న దైవమును సమన్వయించి, దానిని మూలమును, ఏకత్వమును తెలియబరచుట ప్రారంభించినాడు. ఈ రెండింటి సమన్వయము అత్యంత గుహ్యము. కనుకనే గుహ్యతమము అను పదము వాడబడినది. అట్టి విషయమును తెలియవలె నన్నచో శ్రోత శ్రద్ధ, భక్తి, దీక్ష, ఏకాగ్రత, అప్రమత్తత, ఆర్ద్రత ఇత్యాది సద్గుణములతో పాటు, అసూయ లేనివాడై యుండ వలెను. 🍀*
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ || 1
తాత్పర్యము : అత్యంత గుహ్యము, జ్ఞానవిజ్ఞాన సహితము అగు విషయమును అసూయ లేనివాడ వగుటచే నీకు పరిపూర్ణముగను, స్పష్టముగను తెలుపుచున్నాను. దీనిని తెలియుట వలన అశుభము నుండి మోక్షము పొందెదవు.
వివరణము : పరమాత్మ జీవుల పుణ్యవశాత్తు, పూర్ణముగ రూపు కట్టుకొనుటవలన శ్రీకృష్ణుడుగ గోచరించినాడు. పరిపూర్ణ జ్ఞానము తానే స్వయముగ బోధించినాడు. ఏడ (7)వ అధ్యాయమున సృష్టింపబడిన జగత్తు నందు దైవమును చూచు విధాన మంతయు తెలిపినాడు. ఎనిమిద(8)వ అధ్యాయమున అట్టి జగత్తున కాధారమైన, అక్షరము - పరము - బ్రహ్మము అయిన తత్త్వమును ఎట్లు పొందవలెనో స్పష్టముగ తెలిపినాడు. బహిరంగ అంతరంగములందు దైవముతో ఎట్లు యోగము చెందవచ్చునో తెలిపియున్నాడు. అనగా విజ్ఞానము, జ్ఞానము లేక బహిరంగము అంతరంగమందలి దైవమును తెలియు విధానమును తెలిపినాడు.
లోపల, వెలుపల వశించియున్న దైవమును సమన్వయించి, దానిని మూలమును, ఏకత్వమును తెలియబరచుట ప్రారంభించినాడు. ఈ రెండింటి సమన్వయము అత్యంత గుహ్యము. కనుకనే గుహ్యతమము అను పదము వాడబడినది. అట్టి విషయమును తెలియవలె నన్నచో శ్రోత శ్రద్ధ, భక్తి, దీక్ష, ఏకాగ్రత, అప్రమత్తత, ఆర్ద్రత ఇత్యాది సద్గుణములతో పాటు, అసూయ లేనివాడై యుండ వలెను. అసూయ ఉన్న హృదయమునందు జ్ఞాన విజ్ఞానములు నిలువవు. జ్ఞాన విజ్ఞానములే లేనపుడు వాని సమన్వయ మెట్లు నిలువగలదు?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 451🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 30
*🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 5 🌻*
తరువాత నాల్గు ముఖములు గలవాడు, ఎర్రని వర్ణముగలవాడు, వేద సూక్తములను పఠించుచున్నవాడు అగు సృష్టికర్తను ఆ హిమవంతుడు గాంచెను (46). తరువాత ఆ పర్వత రాజు జగత్తులకు చూపును అనుగ్రహించు సూర్య భగవానుని క్షణకాలము గాంచి విస్మయమును పొందెను (47).
ఓ కుమారా! అపుడు ఆ పర్వతుడు మహాద్భుతము, పార్వతీ సహితము, రమ్యము, నవ్వుచున్నమోము గలది, గొప్పతేజస్సు గలది యగు రుద్ర రూపమును గాంచెను (48). ఆ తరువాతతేజోరూపము, నిరాకారము, నిరంజనము, ఉపాధిలేనిది, సంకల్పములు లేనిది, మహాద్భుతము అగు నిర్గుణ స్వరూపమును గాంచెను (49).
ఈ తీరున ఆ హిమవంతుడు భిక్షుకుని యందు అనేక రూపములను గాంచి మిక్కిలి ఆశ్చర్యమును, పరమానందమును పొందెను (50). అపుడు జగత్కారణుగగు ఆ ఆది భిక్షువు ఆతని నుండి గుర్గను భిక్షగా నిమ్మని గోరెను. మరియొక భిక్షను ఆయన స్వీకరించలేదు (51).
శివమాయచే మోహితుడైన పర్వతరాజు అంగీకరించ లేదు. ఆ భిక్షువు ఇతరమును స్వీకరించకుండగనే అచ్చటనే అంతర్ధానమయ్యెను (52). అపుడు 'మనలను శివప్రభుడు మోసగించి తన స్థానమునకు వెళ్లినాడు' అను జ్ఞానము మేనా హిమవంతులకు కలిగెను (53). ఇట్లు ఆలోచించిన వారిద్దరికి మహామోక్షమును కలిగించునది, దివ్యమైనది, సర్వానందముల నిచ్చునది అగు శివభక్తి ఉదయించెను (54).
శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహితయందు పార్వతి మరలి వచ్చుట అను వృత్తాంతమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసెను (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 128 / Viveka Chudamani - 128🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 27. విముక్తి - 1 🍀*
422. విజ్ఞానము యొక్క ఫలితముగా, అజ్ఞానముతో కూడిన ఫలితముల నుండి విముక్తి పొందుట జరుగుతుంది. అజ్ఞానమునకు అంటిపెట్టుకొని ఉన్నచో దాని ఫలితము బంధనాలు. ఈ విషయము ఎడారిలోని ఎండమావి వంటిది. ఏ ప్రయోజనము లభించదు. అలా కాక బ్రహ్మమును గూర్చి తెలుసుకొన్నచో ఫలితములు చెడుగా ఉండవు కదా!
423. హృదయములో అజ్ఞానముతో కూడిన ముడులు పూర్తిగా విడిపోయిన, ఏవిధముగా అట్టి వ్యక్తి స్వార్ధ పూరితముగా వ్యవహరించగలడు? అట్టి వ్యక్తి భౌతిక వస్తు సముదాయ ఆనందాలకు విముఖుడై ఉంటాడు.
424. ఎపుడైతే బాహ్య వస్తు సముదాయము పట్ల ఏవిధమైన కోరికలు లేనిచో అతడు శాంతి శిఖరమును అదిరోహించగలడు. జ్ఞానము యొక్క అత్యున్నత స్థితి వలన, అహంకార పూరితమైన భావనలన్నింటికి అంతము పలికినట్లే. మరియు స్వయముగా అతడు తాను విముక్తి మార్గమును చేరి ఈ భౌతిక బంధనాలన్ని ఆత్మలో విలీనమై అదృశ్యమవుతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 128 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 27. Redemption - 1 🌻*
422. The result of knowledge should be the turning away from unreal things, while attachment to these is the result of ignorance. This is observed in the case of one who knows a mirage and things of that sort, and one who does not. Otherwise, what other tangible result do the knowers of Brahman obtain ?
423. If the heart’s knot of ignorance is totally destroyed, what natural cause can there be for inducing such a man to selfish action, for he is averse to sense-pleasures ?
424. When the sense-objects excite no more desire, then is the culmination of dispassion. The extreme perfection of knowledge is the absence of any impulsion of the egoistic idea. And the limit of self-withdrawal is reached when the mind-functions that have been merged, appear no more.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 80 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 *సాధన- సమిష్టి జీవనము - 1* 🌻
ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము.
సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు ఇవన్నీ భక్తి సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది.
సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా ముందు భావనలో రూఢీచేసుకోవాలి. అలా లేని సందర్భంలోనే, వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.
సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు.
కాని ఇందులో ఒక ఇబ్బంది ఎదురవుతుంది, ఒక మంచిపనిని ప్రారంభించినప్పుడు కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి. ఇక సేవ యాంత్రికముగా మాత్రమే సాగుతుంటుంది.
సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.
......✍️ *మాస్టర్ ఇ.కె.*
(To be Continued)
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 69 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 69. GOALS 🍀*
*🕉 Life is goal-less ... and that is the beauty of it! 🕉*
If there were a goal to life, things would not be so beautiful, because one day you would come to the very end, and then everything after that would just be boring. There would be repetition, repetition, repetition; the same monotonous state would continue-and life abhors monotony. It goes on creating new goals because it has none! Once you attain a certain state, life gives you another goal.
The horizon goes on and on running in front of you; you never reach it, you are always on the way-always reaching, just reaching. And if you understand that, then the whole tension of the mind disappears, because the tension is to seek a goal, to arrive somewhere. Mind is continuously hankering for arrival, and life is a continuous departure and arrival again--but arriving just to depart once more. There is no finality to it. It is never perfect, and that's its perfection. It is a dynamic process, not a dead, static thing.
Life is not stagnant--c: it is flowing and flowing, and there is no other shore. Once you understand this you start enjoying the journey itself. Each step is a goal, and there is no goal. This understanding, once -it settles deep into your inner core, relaxes you. Then there is no tension because there is nowhere to go, so you cannot go astray.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 128 / Sri Lalita Sahasranamavali - Meaning - 128 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 128. సర్వ వేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ |*
*లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా ‖ 128 ‖ 🍀*
🍀 645. సర్వవేదాంత సంవేద్యా -
అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
🍀 646. సత్యానంద స్వరూపిణీ -
నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
🍀 647. లోపాముద్రార్చితా -
లోపాముద్రచే అర్చింపబడింది.
🍀 648. లీలాక్లుప్త బ్రహ్మాండమండలా -
క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 128 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 128. sarvavedānta-saṁvedyā satyānanda-svarūpiṇī |*
*lopāmudrārcitā līlā-kḷpta-brahmāṇḍa-maṇḍalā || 128 || 🌻*
🌻 645 ) Sarva vedhantha samvedya -
She who can be known by all Upanishads
🌻 646 ) Satyananda swaroopini -
She who is personification of truth and happiness
🌻 647 ) Lopa mudrarchitha -
She who is worshipped by Lopa Mudhra the wife of Agasthya
🌻 648 ) Leela kluptha brahmanda mandala -
She who creates the different universes by simple play
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment