శ్రీ శివ మహా పురాణము - 451
🌹 . శ్రీ శివ మహా పురాణము - 451🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 30
🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 5 🌻
తరువాత నాల్గు ముఖములు గలవాడు, ఎర్రని వర్ణముగలవాడు, వేద సూక్తములను పఠించుచున్నవాడు అగు సృష్టికర్తను ఆ హిమవంతుడు గాంచెను (46). తరువాత ఆ పర్వత రాజు జగత్తులకు చూపును అనుగ్రహించు సూర్య భగవానుని క్షణకాలము గాంచి విస్మయమును పొందెను (47).
ఓ కుమారా! అపుడు ఆ పర్వతుడు మహాద్భుతము, పార్వతీ సహితము, రమ్యము, నవ్వుచున్నమోము గలది, గొప్పతేజస్సు గలది యగు రుద్ర రూపమును గాంచెను (48). ఆ తరువాతతేజోరూపము, నిరాకారము, నిరంజనము, ఉపాధిలేనిది, సంకల్పములు లేనిది, మహాద్భుతము అగు నిర్గుణ స్వరూపమును గాంచెను (49).
ఈ తీరున ఆ హిమవంతుడు భిక్షుకుని యందు అనేక రూపములను గాంచి మిక్కిలి ఆశ్చర్యమును, పరమానందమును పొందెను (50). అపుడు జగత్కారణుగగు ఆ ఆది భిక్షువు ఆతని నుండి గుర్గను భిక్షగా నిమ్మని గోరెను. మరియొక భిక్షను ఆయన స్వీకరించలేదు (51).
శివమాయచే మోహితుడైన పర్వతరాజు అంగీకరించ లేదు. ఆ భిక్షువు ఇతరమును స్వీకరించకుండగనే అచ్చటనే అంతర్ధానమయ్యెను (52). అపుడు 'మనలను శివప్రభుడు మోసగించి తన స్థానమునకు వెళ్లినాడు' అను జ్ఞానము మేనా హిమవంతులకు కలిగెను (53). ఇట్లు ఆలోచించిన వారిద్దరికి మహామోక్షమును కలిగించునది, దివ్యమైనది, సర్వానందముల నిచ్చునది అగు శివభక్తి ఉదయించెను (54).
శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహితయందు పార్వతి మరలి వచ్చుట అను వృత్తాంతమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసెను (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
11 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment