వివేక చూడామణి - 128 / Viveka Chudamani - 128
🌹. వివేక చూడామణి - 128 / Viveka Chudamani - 128🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 27. విముక్తి - 1 🍀
422. విజ్ఞానము యొక్క ఫలితముగా, అజ్ఞానముతో కూడిన ఫలితముల నుండి విముక్తి పొందుట జరుగుతుంది. అజ్ఞానమునకు అంటిపెట్టుకొని ఉన్నచో దాని ఫలితము బంధనాలు. ఈ విషయము ఎడారిలోని ఎండమావి వంటిది. ఏ ప్రయోజనము లభించదు. అలా కాక బ్రహ్మమును గూర్చి తెలుసుకొన్నచో ఫలితములు చెడుగా ఉండవు కదా!
423. హృదయములో అజ్ఞానముతో కూడిన ముడులు పూర్తిగా విడిపోయిన, ఏవిధముగా అట్టి వ్యక్తి స్వార్ధ పూరితముగా వ్యవహరించగలడు? అట్టి వ్యక్తి భౌతిక వస్తు సముదాయ ఆనందాలకు విముఖుడై ఉంటాడు.
424. ఎపుడైతే బాహ్య వస్తు సముదాయము పట్ల ఏవిధమైన కోరికలు లేనిచో అతడు శాంతి శిఖరమును అదిరోహించగలడు. జ్ఞానము యొక్క అత్యున్నత స్థితి వలన, అహంకార పూరితమైన భావనలన్నింటికి అంతము పలికినట్లే. మరియు స్వయముగా అతడు తాను విముక్తి మార్గమును చేరి ఈ భౌతిక బంధనాలన్ని ఆత్మలో విలీనమై అదృశ్యమవుతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 128 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 27. Redemption - 1 🌻
422. The result of knowledge should be the turning away from unreal things, while attachment to these is the result of ignorance. This is observed in the case of one who knows a mirage and things of that sort, and one who does not. Otherwise, what other tangible result do the knowers of Brahman obtain ?
423. If the heart’s knot of ignorance is totally destroyed, what natural cause can there be for inducing such a man to selfish action, for he is averse to sense-pleasures ?
424. When the sense-objects excite no more desire, then is the culmination of dispassion. The extreme perfection of knowledge is the absence of any impulsion of the egoistic idea. And the limit of self-withdrawal is reached when the mind-functions that have been merged, appear no more.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
11 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment