భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 152


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 152 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 31 🌻


603.నిర్వాణము - నిర్వికల్పము.

శరీరము నిలిచి యుండగనే ఇది ప్రాప్తించును. అప్పుడు విదేహముక్తుడగును. దేహమునకు ముక్తి కాదు. దేహము కాని దానికి--అనగా, స్వాత్మకు ముక్తి లభించును.

604. విదేహ ముక్తి:-

మానవుడు భగవంతుడైన తరువాత 3 లేక 4 రోజుల వరకు అతని శరీరము నిలిచి యుండును. ఇతని చైతన్యము పూర్తిగా భగవంతునిలో కరిగిపోవును. కనుక దేహములయందు, సృష్టియందు స్పృహయుండదు. వారు నిరంతరముగా సచ్చిదానంద స్థితిని అనుభవించుచుందురు. కాని వాటిని సృష్టిలో ఎఱుకతో వినియోగించరు. ఇతరులు ముక్తులగుకు సహాయపడరు.

కానీ, వారు భూమిమీద ఉన్నకొలది రోజులు, వారి సాన్నిధ్యము అనంతజ్ఞాన శక్యానందములను ప్రసారము చేయుటలో కేంద్రముగా నుండును;

వారిని దరిచేరువారును, సేవించువారును, పూజించువారును, మిక్కిలి ప్రయోజనమును పొందెదరు ఇతరులు తమ తమ ప్రారబ్ధము ననుసరించి సంవత్సరముల కొలది శరీరములను నిల్పుకొందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Jan 2021

No comments:

Post a Comment