గీతోపనిషత్తు -235
🌹. గీతోపనిషత్తు -235 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 17 -2
🍀 16 -2. బ్రహ్మసృష్టి - ఒక బ్రహ్మ సంవత్సరమున 360 రోజులు కలవనియు, కనుక 720 వేల యుగములు యుండునని తెలుపుదురు. అట్టి బ్రహ్మ సంవత్సరములు ఒక వంద సంవత్సరములుగ తెలుపుదురు. పై తెలిపిన లెక్కలన్నియు రహస్యార్ధముతో కూడినవి. అందు చూపబడిన సున్నలలో రహస్య మిమిడి యున్నదని, బ్రహ్మర్షులు మాత్రమే కాలమానము, యుగములు స్పష్టముగ తెలిసి యుందు రని, ఇతరులకది అగమ్యగోచరమని కూడ పెద్దలు తెలిపినారు. 🍀
సహస్రయుగపర్యంత మహ ర్యద్మహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః || 17
తాత్పర్యము : బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము.
వివరణము : ఒక బ్రహ్మ సంవత్సరమున 360 రోజులు కలవనియు, కనుక 720 వేల యుగములు యుండునని తెలుపుదురు. అట్టి బ్రహ్మ సంవత్సరములు ఒక వంద సంవత్సరములుగ తెలుపుదురు. పై తెలిపిన లెక్కలన్నియు రహస్యార్ధముతో కూడినవి. అందు చూపబడిన సున్నలలో రహస్య మిమిడి యున్నదని, బ్రహ్మర్షులు మాత్రమే కాలమానము, యుగములు స్పష్టముగ తెలిసి యుందు రని, ఇతరులకది అగమ్యగోచరమని కూడ పెద్దలు తెలిపినారు.
కాలము యొక్క పరిమాణము బ్రహ్మవిదులకే తెలుయునని తెలియవలెను. కాలమానము విషయమున విభిన్నమగు వ్యాఖ్యానములు కలవు. ఒక కలియుగ పరిమాణము గూర్చియే
అనేక విధమగు పండితాభిప్రాయము లుండగ, సృష్టికొలత మరింత అగోచరమై యుండును. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము, అట్లే కటక సంక్రమణము, దక్షిణాయన పుణ్య కాలము గూర్చి కూడ భిన్నాభిప్రాయము లున్నవి.
భగవద్గీతయందు ఈ శ్లోకమున సహస్రయుగ పర్యంతము ఒక పగలు, సహస్రయుగ పర్యంతము ఒక రాత్రిగ బ్రహ్మదేవుని ఒక రోజుండునని పెద్దలు చెప్పుచున్నారని చెప్పబడినది. ఇంకయు వివరములు తెలియుట కుత్సహించువారు సాయన, నిరయన పంచాంగములను పరిశీలించుకొనుట చేయవచ్చును.
కలియుగ మారంభము ప్రథమ పాదమున నున్నదని పెద్దలు భావింపగ, కలియుగ మంతమగుచున్నదని మరికొందరు భావించు చున్నారు. కొందరు కలియుగ మైపోయినదని కూడ వాదించుచు నుందురు. ప్రస్తుత కాలమున ఇదియొక చర్చనీయాంశమై, పండితులను కాలము మ్రింగుచు నున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment