🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దధీచిమహర్షి-సువర్చల - 2 🌻
7. ఈ ప్రపంచంలో చెట్లు మొదలైనవన్నీకూడా మన శరీరాలవలె పుట్టి కొంతకాలము పెరిగి చచ్చిపోతున్నాయి. కానీ చైతన్మ్ ఉంటున్నంతసేపు మాత్రమే అవి ఉంటున్నాయి.
8. మనిషికి శరీరం అనేది ఉన్నది. అది ప్రాణం ఉన్నంతసేపుమాత్రమే! ప్రాణంపోతే దానిని శవం అంటాము. అది అప్పుడు పంచభూతాలలో కలసిపోతుంది. పంచభూతాలతో నిర్మాణంచేయబది చైతన్యమాత్రంగా తిరుగుతున్నంతసేపు దానికొక వ్యక్తిత్వము, దానికొక చిత్తము, బుద్ధి, మనసు-ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ విషయం గ్రహించటమే ఆర్యసంస్కృతియొక్క ముఖ్యలక్షణం.
9. ఒక నిగూఢమయినటువంటి ప్రకృతిరహస్యమది. అది వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రతివస్తువునందు జాగ్రత్తతో దానిని చూచేవారు ఆర్యులు. వృక్షమంటే వృక్షమేకదా అని దాన్ని కొట్టకు. మొక్కలను కొట్టి, ఎండబెట్టి పొయ్యిలో పెట్టడము-ఇలాంటివి సాధారణముగా జరుగుతూనే ఉంటాయి.
10. ఒక మోదుగుచెట్టు దగ్గరికి బ్రాహ్మణుడు వెళ్ళి, “ఓ మోదుగు వృక్షమా! నీ కొమ్మను ఒకదానిని నేను యజ్ఞంకోసమని తీసుకుంటాను” అని ప్రార్థిస్తాడు. దానిని చూచి ఎవరైనా, “ఏమిటండీ! ఆయన పిచ్చివాడా! చెట్టును ప్రార్థించటం ఏమిటి? వేదాల్లో చెప్పబడిన మంత్రం ఇదేనా?” అనవచ్చు.
11. అంటే నిగూఢమయిన ఒకానొక చైతన్యము, నిగ్రహానుగ్రహ సమర్థత-ఈ పంచభూతములలో-వృక్షములలో చూడటమే వాళ్ళకున్న విశేషమయిన జ్ఞానము. దానినే మన పూర్వీకులకున్న వేదవిజ్ఞానము అనవచ్చు.
నిజంగా ఆలోచిస్తే కుడిచేతిపని కుడిచేతిదే, ఎడమచేతిది దానిదే! కుడిచేయిభోజనం చెయాడంవల్ల గొప్పదనుకుంటే, అది విరిగిపోతే ఎడమచేతితో తినవలసి రావటంలేదా! దేనిపని, దేవివిలువ దానిదే.
12. లోకంలో క్షిత్రియుడు లేకుండా ధర్మరక్షణ జరగదు. బ్రాహ్మణుడులేకుండా ధర్మముండదు. ధర్మం ఉండాలి. అది రక్షింపబడాలి. రెండూ జరగాలి. అంటే, బ్రాహ్మణుడివల్ల ధర్మం యొక్క ఉనికినినుస్తుంది. దాని యొక్క రక్షణ క్షత్రియుడివల్ల జరుగుతుంది. ఈ ప్రకారంగా వ్యవస్థ చేయబడిఉంది ఆర్యధర్మంలో.
13. అయితే పురాణాల్లో చెప్పబడినట్లు, ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణుడుచేసే పని క్షత్రియుడిచేత, క్షత్రియుడు చేసేపని బ్రాహ్మణుడిచేత జరుపబడిన సందర్భాలూ ఉన్నవి. సమర్థతనుబట్టి అలా జరిగేవి. అంటే బ్రాహ్మక్షత్రాలు పరస్పరపోషకంగా ఉండే రెండు ప్రవృత్తులు. అవి జననకులాన్నిబట్టే ఉండాలనిలేదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
25 Dec 2020
No comments:
Post a Comment