🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 16 🍀
హరి బుద్ధీ జపే తో నర దుర్లభ్!
వాచేసి సులభ్ రామకృష్ణ!!
రామకృష్ణ నామీ ఉన్మనీ సాధిలీ!
తయాసీ లాధలీ సకళ్ సిద్ధీ!!
సిద్ధి బుద్ధీ ధర్మ్ హరిపాఠీ ఆలే!
ప్రపంచీ నివాలే సాదు సంగే!!
జ్ఞానదేవీ నామ రామకృష్ణ రసా!
యెణే దశదిశా ఆత్మారామ్!!
భావము:
రామ కృష్ణ నామము నాలుకతో పలుకడము చాలా సులభము అయిన కాని హరి నామ జపము చేయాలనే బుద్ధి కలిగే నరులు దుర్లభము.
రామకృష్ణ నామము మనుసును ఉన్మనిస్థితికి చేర్చును. అప్పుడు వారికి సకల సిద్ధులు లభించును. హరిపాఠము పఠించే వారికి సిద్ధి, బుద్ధి మరియు ధర్మాలు తెలిసిపోయి సాధువుల సాంగత్యముతో ప్రాపంచీకుల మనసు నిశ్చలమగును.
నామ స్మరణ వలన రామకృష్ణ స్వరూప ముద్రాంకితులై వారికి దశదిశలయందు ఆత్మారాముడు దర్శనమిస్తాడని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.
🌻. నామ సుధ -16 🌻
హరి బుద్ధితో నామ జపము
చేయు నరులు బహు దుర్లభము
పలకడానికి అతి సులభము
రామకృష్ణుల మధుర నామము
రామ కృష్ణనామ ధ్యానము
మనసును హరిలో చేయునిమగ్నము
వెంబడించును సిద్ధులు సర్వము
అయినవి వారికి వెంటనే ప్రాప్తము
సిద్ధిబుద్ధి మరియు ధర్మము
హరిపాఠకునిలో చేరును సులభము
సాధు జనులతో సాంగత్యము
ప్రాపంచీకుల మనసు నిశ్చలము
జ్ఞానదేవునిలో హరినామము
రామ కృష్ణ ముద్రాంకితము
దశ దిశలందున భవ్య రూపము
ఆత్మారాముని దివ్యదర్శనము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
25 Dec 2020
No comments:
Post a Comment