శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 349-2. 'వందారు జనవత్సలా' 🌻
భక్తి మార్గమున జీవనయాత్ర సాగించువారు ఎవరికి నమస్కారము చేయుటకైననూ సంసిద్ధులై యుందురు. అందులకే భక్తుల విషయమున భగవత్ తత్త్వము కూడ అమిత వాత్సల్యము కలిగి యుండును. 'వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొనే' నని సామెత కలదు. వసుదేవుడు అనన్య భక్తియుతుడు. అతని కందరి యందు దైవమే గోచరించును. అత్యంత పవిత్రమూర్తి. సంస్కారవంతుడైన వసుదేవుడు దురహంకారియైన కంసుని, దేవకిని రక్షించుకొనుటకై గాడిద కాళ్ళు పట్టుకొనుటకు కూడ వెనుకాడలేదు.
వసుదేవుని ఈ చర్యయే శ్రీకృష్ణ అవతారమునకు తెర తొలగించినది. భక్త జను లనగా అంతర్యామియైన దైవమును అందరి యందు దర్శించుచూ దైవ సంకల్పమును నిర్లిప్తతతో నిర్వర్తించువారు. అట్టి వారియందు అమిత వాత్సల్యమును శ్రీమాత చూపును. శ్రీకృష్ణుడు అంతర్యామి దైవమే. అతడు అర్జునునితో ఇట్లు పలికెను. “అర్జునా! నేను వైకుంఠమునందు అప్పసము (ఎల్లవేళలా) వుండను. యోగుల హృదయములందు కూడ నిరంతర ముండను. నన్ను సతతము స్మరించు భక్తులతో మాత్రమెప్పుడునూ ఉందును.”
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 349. Vandāru-jana-vatsalā वन्दारु-जन-वत्सला (349) 🌻
This can be considered as an extension of the previous nāma. She loves Her devotees like a mother who loves her children. The vibration of love is emanated through one’s body like fragrance of a flower. Because of caring and loving nature also She is known as Vimalā (nāma 347). One can notice this in daily life. When one serves food for his dog, by impulse he develops love for his dog and this is radiated through his body. The dog reads his vibrations and feels his love and wags its tail as a token of reciprocating his love.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment