శ్రీ శివ మహా పురాణము - 521


🌹 . శ్రీ శివ మహా పురాణము - 521 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 7 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేనక ఈ తీరున పరిపరి విధముల దుఃఖించి బిగ్గరగా రోదించెను. ఓ మునీ! ఆమె మనస్సు దుఃఖముతో నిండియుండెను (72). అపుడు నేను వెంటనే అచటకు వచ్చి దుష్ట జ్ఞానమును హరించి వేయు ఉత్తమమైన పరమ శివతత్త్వమును ఆ మేనకకు బోధించితిని (73).

ఓ మేనా! నా శుభకరములగు పలుకులను ప్రీతితో వినుము. నా మాటను శ్రద్ధగా విన్నచో, నీ చెడు బుద్ధి నశించును (74). జగత్తును సృష్టించి, పోషించి, లయము చేయునది శంకరుడే. నీవు ఆయన రూపమును ఎరుంగవు. ఆయన దుఃఖమునకు నిలయుడని నీవు ఎట్లు ఊహించుచున్నావు? (75)

ఆ ప్రభుడు అనేక నామ రూపములతో వివిధ లీలలను చూపుచుండును. ఆ సర్వేశ్వరుడు స్వతంత్రుడు. మాయకు ప్రభువు. అద్వితీయుడు (76). ఓ మేనా! నీవీ సత్యము నెరింగి శివునకు ఇమ్ము. చెడు పట్టుదలను, సర్వకార్యములను పాడు జేయు జ్ఞానమును విడిచిపెట్టుము (77) ఓ మునీ! ఈ నా మాటను విని ఆ మేన పరిపరి విధముల విలపించుచూ సిగ్గును కొద్దిగా మెల్లగా విడిచి నాతో ఇట్లు పలికెను (78).

మేన ఇట్లు పలికెను -

ఓ బ్రహ్మా! నీవు ఈమె యొక్క గొప్ప రూపమును ఏల వ్యర్థము చేయ నిచ్చగించుచున్నావు? ఈమెను నీవె స్వయముగా సంహరించరాదా? (79). శివునకు ఇమ్మని నీవు నాకు చెప్పకుము. నాకు ప్రాణ ప్రియురాలగు ఈ నా కుమార్తెను నేను శివునకు ఈయను (80).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆమె ఇట్లు చెప్పగా, అపుడు సనకాది సిద్ధులు ముందుకు వచ్చి మహాప్రేమతో ఇట్లు పలికిరి (81).

సిద్ధులిట్లు పిలికిరి -

బ్రహ్మానందమును ఇచ్చువాడు, జగన్నాథుడు అగు ఈ పరమశివుడు దయతో నీ కుమార్తెకు సాక్షాత్కరించి దర్శన మిచ్చినాడు (82).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Feb 2022

No comments:

Post a Comment