నిర్మల ధ్యానాలు - ఓషో - 132
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 132 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మార్మికుడు దేవుడికి సంబంధించిన విషయంలో మౌనంగా వుంటాడు. కారణం నిజమైన దేవుడు నిశ్శబ్దంలో మాత్రమే అనుభవానికి వస్తాడు. కాబట్టి దేవుడికి సంబంధించిన అభిప్రాయాల్ని వదిలిపెట్టి మరింత మరింత నిశ్శబ్దంగా మారు. 🍀
నీకు కొంత తెలివితేటలు వుంటే చాలు. నిన్ను ఏ మతమూ సంతృప్తి పరచలేదు. అన్ని మతాల్లో అలవిమీరిన తెలివి తక్కువ తనముంది. నిజమైన మార్మికుడు దేవుడికి సంబంధించిన విషయంలో మౌనంగా వుంటాడు. కారణం నిజమైన దేవుడు నిశ్శబ్దంలో మాత్రమే అనుభవానికి వస్తాడు. కాబట్టి దేవుడికి సంబంధించిన అభిప్రాయాల్ని వదిలిపెట్టి మరింత మరింత నిశ్శబ్దంగా మారు.
నిశ్శబ్దం సంపూర్ణ నిశ్శబ్దంలా మారినపుడు నువ్వు ఆశ్చర్యానికి లోనవుతావు. నువ్వు అతని పదధ్వనుల్ని వినవు. ఒక క్షణం అతనక్కడ వుండడు. యింకో క్షణం వుండదు. నువ్వు అతనితో కలిసి సాగుతావు. నువ్వు వెనుకటిలా వుండవు. అంతే కాదు అప్పుడు ఈ ప్రపంచం కూడా వెనకటిలా వుండదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
06 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment