సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖
🌻 210. 'మహాలక్ష్మీ' 🌻
దేవి వైభవము అని అర్థము. శ్రీదేవి శక్తి స్వరూపిణిగ పార్వతిగను, వైభవరూపిణిగ లక్ష్మిగను, విద్యారూపిణిగ సరస్వతిగను ఆరాధింపబడుచున్నది. సృష్టి వైభవమే శ్రీమహాలక్ష్మి. మహాలుడను రాక్షసుని చంపినందున ఆమె మహాలస, మహాలక్ష్మి అని ప్రసిద్ధి చెందినది. ఆమె అత్యంత సౌందర్యవతి. సర్వమనోహరి కూడ.
ఎప్పుడునూ పదమూడు సంవత్సరముల వయస్సుగల కన్యగ ఆమె గోచరించును. భూమిపైన మహలక్ష్మి పడమటి సముద్ర తీరమున సహ్యాద్రి కొండచరియలలో వసించుచున్నదని పురాణములు తెలుపు చున్నవి. కరవీర పురమున కూడ వసించు చున్నదని పురాణములు తెలుపుచున్నవి. ప్రస్తుతమున ఈ కరవీరపురమును కోల్హాపూర్ అని పిలుచుచున్నారు.
లక్ష్మి అను పదమునకు సంకేతమని అర్థము కలదు. రూపము లన్నియూ సంకేతములే. ఇది ఉప్పు అని, ఇది పప్పు అని రూపమును బట్టే జీవులు గుర్తించు చుందురు. అట్లే ఇతడు ఇంద్రుడని, ఇతడు విష్ణువని రూపములనుబట్టే తెలియబడు చున్నది. కోటానుకోట్ల
రూపములుగ సృష్టి వున్నప్పటికిని అందరి జీవులను, లోకములను గుర్తించుటకు రూపమే ఆధారము. రూపములన్నియూ గుణములను పట్టి ఏర్పడుచున్నవి.
గుణములన్నియూ త్రిగుణముల నుండి పుట్టినవే. త్రిగుణములు శ్రీమాత యందు పుట్టినవి. మహాలక్ష్మి యనగా శ్రీమాత రూప సంపద. నీరును నీరుగా గుర్తించుటకు, అట్లే అగ్ని, వాయువు, ఆకాశములను గుర్తించుటకు, లోకములను, అందలి జీవులను గుర్తించుటకు ఆవశ్యకత ఎంతయూ కలదు. పులిని - పిల్లిని, కుక్కను - నక్కనూ భేద మెరిగి జీవించుటలో సదుపాయమున్నది.
రూపమును బట్టి గుణమును కూడ అంచనా వేయవచ్చును. పులిని - పిల్లిని అట్లే అంచనా వేయుచున్నాము. మానవుల యందు కూడ వివిధ స్వభావములను (గుణములు) బట్టియే వారి రూపము లేర్పడుచున్నవి. వికృత రూపములు వికృత గుణములను సంకేతించు చుండును. రామ లక్ష్మణులను జూచిన హనుమంతుడు వెంటనే వారిని దివ్యపురుషులుగా గుర్తించెను.
హనుమంతుని చూచిన శ్రీరాముడు అతనిని వెంటనే వేదవిదుడని గుర్తించెను. అట్లే విభీషణుని జూచిన హనుమంతుడు అతనిని సత్పురుషునిగ గుర్తించెను. సృష్టి యందు లక్ష్మీరూపములు, అలక్ష్మీ రూపములు కలవు. వానిని తెలియుటకే సాముద్రిక శాస్త్రము. అలక్ష్మీ రూపముల యందు రజస్తమస్సులు అధికమై యుండును. లక్ష్మీప్రద రూపములందు సత్త్వగుణ మబ్బును. సత్వగుణ మధిక మగుచున్నకొలదీ ఆరాధించు వారి రూపము కూడ తదనుగుణమైన అందము, ఆకర్షణము కలిగి యుండును.
కోతి రూపమున నుండిననూ హనుమంతుడు అందము గనే గోచరించును కదా! అట్లే గజముఖుడగు గణేశుడు. అట్లే ప్రమథ గణములు కూడ. ఇవి విశిష్టమగు లక్ష్మీ రూపములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 210 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahālakṣmī महालक्ष्मी (210) 🌻
The great (mahā) wife of Viṣṇu. Śiva manifests in the form of Viṣṇu for sustenance and His wife is Mahālakṣmī. Liṅga Purāṇa says that Mahālakṣmī is the mother of the universe.
“May Lakśmī who is endowed with all attributes, who has all three characteristics, who is the goodness that bestows all and who is omnipresent, dispel my sin” is a hymn in Liṅga Purāṇa. Mahālakṣmī also means a girl of thirteen years.
If Mahālakṣmī is worshipped on every 13th lunar day (trayodaśa) with Her bīja (śrīṃ- श्रीं), there will no dearth of prosperity and auspiciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Feb 2021
No comments:
Post a Comment