🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 4 🌻
19. శమరతుడి (శమమనే గుణం కలిగినవాడు) స్వభావం అలా ఉంటుంది. గౌరవం లభించినప్పుడు మిక్కిలి దుఃఖంపొందినట్లువలె దానిని చూస్తాడు. తనను ద్వేషించేవాడు ఒకడుంటాడు. తనను మైత్రితో ఆరాధించేవాడు మరొకడుంటాడు. వాళ్ళిద్దరి విషయంలోనూ తనకుమాత్రం ఒకే భావన ఉండాలి.
20. వాడు నన్ను మైత్రితో చూస్తున్నాడు కాబట్టి వాడిని గౌరవించటము, నన్ను అగౌరవపరుస్తున్నాడు కాబట్టి ఒకడిని ద్వేషించటం సామాన్యమైన లక్షణమే! అయితే అది తపస్సుకు యోగ్యమైనదికాదు.
21. దానివలన మనిషికి ఎలాంటి ఫలమూ లభించకపోగా తపస్సు క్షీణిస్తుంది. కాబట్టి శత్రువు యందు, మిత్రుడియందు – అందరియందు – తన దృష్టి మాత్రం మారకూడదు. అలా ఉండగలిగితే, ఎట్టివాడినైనా మార్చగలిగిన శక్తివంతుడవుతాడు.
22. ఒకడు మనని క్షణంలో క్రోధంలో దింపగలిగితే, మరోకడు క్షణంలో మనలో ద్వేషాన్ని పుట్టించగలిగితే, వేరొకడు క్షణంలో మన ప్రసన్నులను చేయగలిగితే-ఇంక మనం ఏం స్వతంత్రులం?! ఎవరు ఎలాగపడితే అలాగ మార్చడానికి సాధ్యమైన మనిషి అస్వతంత్రుడేకదా! అతడిక ఏం తపస్సు చేస్తాడు? ఏం సంపాదిస్తాడు? ఇంతడు, ఇతడి యొక్క సుఖదుఃకములన్నీ లోకంచేతిలో ఉన్నాయన్నమాట!
23. అతడి తపస్సు పతనం చేయాలంటే ఇతరుల చేతిలో ఉంది. దేవుడి దయ కాదు, మనుష్యుల దయవల్ల బ్రతుకుతాడు వాడు! ఇంతాచేస్తే, ఇతడి యోగక్షేమాలన్నీ సామాన్య మానవుల చేతుల్లో ఉన్నాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
15 Feb 2021
No comments:
Post a Comment