వివేక చూడామణి - 23 / Viveka Chudamani - 23
🌹. వివేక చూడామణి - 23 / Viveka Chudamani - 23 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పంచభూతాలు - 6 🍀
89. జీవాత్మ తాను ఈ శరీరమును ఆవాసముగా పొంది, తాను వేరైనప్పటికి, ప్రాపంచిక వస్తు సముధాయమును, మాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలగు వాటితో శరీరము యొక్క బాహ్య అంగముల ద్వారా అనుభవించు చున్నది. అందువలన ఈ శరీరము మెలుకవ స్థితిలో ఆత్మకు ఒక ఆట వస్తువుగా ఉపయోగ పడుచున్నది.
90. ఈ భౌతిక శరీరము ఆత్మకు ఒక నివాస స్థానము. ఏలానంటే గృహానికి గృహ యజమాని వలె తాను ఈ ప్రాపంచిక వ్యవహారాలన్ని ఈ ఇంటి నుండే కొనసాగించినట్లు.
91. ఈ భౌతిక శరీరము పుట్టుక, పెరుగుదల, చావు అను వివిధ స్థితులతో; కుల, మత, భేదాలతో; రోగాలు వాటి నివారణ చర్యలు; దైవ పూజలు, అవమానాలు, గౌరవాలతో జీవిస్తున్నది.
92. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొంది; నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేయుచున్నవి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 23 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
🌻 Five Elements - 6 🌻
89. Identifying itself with this form, the individual soul, though separate, enjoys gross objects, such as garlands and sandal-paste, by means of the external organs. Hence this body has its fullest play in the waking state.
90. Know this gross body to be like a house to the householder, on which rests man’s entire dealing with the external world.
91. Birth, decay and death are the various characteristics of the gross body, as also stoutness etc., childhood etc., are its different conditions; it has got various restrictions regarding castes and orders of life; it is subject to various diseases, and meets with different kinds of treatment, such as worship, insult and high honours.
92. The ears, skin, eyes, nose and tongue are organs of knowledge, for they help us to cognise objects; the vocal organs, hands, legs, etc., are organs of action, owing to their tendency to work.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
15 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment