✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 24. పూర్వకథ - 2 🌻
మానవుని పూర్వ వృత్తాంతము, భూగోళపు చరిత్ర తెలియుటకు బాహ్య పరిశోధనలతోపాటు అంతశ్శోధన కూడ చాల ముఖ్యము. అంతశ్శోధనలో కలుగు దర్శనముల ఆధారముగా బాహ్య పరిశోధనలు నిర్వర్తించుకొన్నచో సూక్ష్మ విషయములు తెలియగలవు. ఒకప్పటి శిఖరములు ఇప్పుడు సముద్ర గర్భమున నున్నవి.
ఇప్పటి ఉన్నత శిఖరములు ఒకప్పుడు సముద్ర గర్భములో నున్నవియే. ఈ భూమి యిప్పటికి రెండుమార్లు జలప్రళయమును, మరి రెండుమార్లు అగ్నిప్రళయమును చవిచూచినది! యుగముల మార్పిడి జరిగినపుడెల్ల కొన్ని నాగరికతలు, కొన్ని భూభాగములు అదృశ్యమై పరిశోధనమునకు అందక నిలచును. పూర్వము ఈ భూమిపై మూడు కన్నులు కల మానవులు యున్నారు. నాలుగు చేతులు, మూడు కన్నులు కలిగిన మానవులు కూడ జీవించిరి.
వారిని సంకేతించుటకే ద్వాపర మున శిశుపాలుడు వికృత రూపమున జన్మించెననియు, కృష్ణ స్పర్శచే అతనికి అప్పుడు జనబాహుళ్యమునకుండిన రూప మేర్పడినదనియు తెలుపబడినది.
పూర్వమేవిధముగ భూఖండములు మార్పు చెందినవో ఇక ముందుకూడ అట్లు మార్పులు చెందుట సంభవము. మానవాకారములకు కూడ ఇట్టి మార్పులు తప్పనిసరి. మార్పు సృష్టియొక్క సహజ లక్షణము కదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Feb 2021
No comments:
Post a Comment