శ్రీ శివ మహా పురాణము - 349


🌹 . శ్రీ శివ మహా పురాణము - 349 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

89. అధ్యాయము - 01

🌻. హిమవంతుని వివాహము -1 🌻

నారదుడిట్లు పలికెను-


ఓ బ్రహ్మా! దక్షపుత్ర యగు సతీదేవి తండ్రి చేసిన యజ్ఞములో దేహమును వీడి పర్వత పుత్రికయై జగన్మాతయైన విధంబెట్టిది?(1) ఆమె మిక్కిలి ఉగ్రమైన తపస్సును చేసి శివుని భర్తగా పొందిన విధంబెట్టిది? నా ఈ ప్రశ్నకు సమాధానమును విస్తారముగా చక్కగా చెప్పుడు(2)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ ఋషిశ్రేష్ఠా| ఉత్తమమైన జగన్మాతృచితదతమును నీవు వినుము. వఅది పరమసావనము,. దివ్యము, పాపములన్నిటినీ పొగొట్టునది, శుభకరము(3) దాక్షాయణీ దేవి శివునితో గూడా ఆనంమదమతో హివతసర్వమునందు క్రీడించుచుండెను. ఆపరమేశ్రవిరకి అది ఒక లీల(4)

ఆ సమయములో హిమవంతుని ప్రియురాలు, సమస్త పంపదలతో నలరాదరునది యగు మేనాదేవి మాతృప్రేమతో 'ఈమె నాకుమార్తె' అని భావించి సేవించెను(5) పరమేశ్వరియగు దాక్షాయణి తండ్రియగు దక్షుని యజ్ఞమునకు వెళ్ళి అచట తండ్రిచే అవమానించబడి, కోపించనదై తన దేహమును త్యాగముచేసెను(6)

ఓ మహర్షీ! హిమవంతునకు ప్రియురాలగు మేనక ఆనాడే శివలోకమునందున్న ఉమాదేవినివ ఆరదించగోరేను(7) అపుడు సతీదేవి దేహమునరు వీడిన తరువాత హిమవంతును కుమార్తేగా ఆమె గర్భమునందు జన్మించవలెనని మనస్సులో నిశ్చయముగ చేసుకొనెను (8)

దేవతలందరిచే స్తుతించబడిన ఆ సతీదేవి దేహమును వీడిన తరువాత సరియగు సమయము రాగానే ప్రేమపూర్వకముగా మేనకకు కుమార్తేయై అవతరించెను(9) పార్వతి యను నపూరుగల ఆ దేవి నారదుని ఉపదేశముచే మిక్కిలి దుష్కరమగు తపస్సును చేసపి మరల శివుని భర్తగా పొందెను(10)

ఓ బ్రహ్మా! విధీ! మహాప్రాజ్ఞా ! నీవు వక్తలలో శ్రేష్ఠుడవు. మేనక యొక్క పుట్టుకను, వివాహమును మరియు చరితమునునాకు చెప్పుము(11) సతీదేవిని కుమార్తెగా పొందిన మేనకాదేవి ధన్యురాలు, పూజ్యురాలు, ఆమె అందరిలో గొప్పపతివ్రత(12)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదమహర్షీ! పార్వతీ తల్లి యొక్క పరట్లుక, వివాహమునను గూచ్చి వినుమ అమె చిరతము పావనము, భక్తిని వృద్ది చేయునది(13) ఓ మహర్షీ! ఉత్తర దిక్కునందు గొప్ప తేజస్సు, సమృద్ధులతో హిమవాన్‌ అని ప్రసిద్దిగాంచిన పెద్ద పర్కవతము ఎకలదు గదా!(14)

దానికి జంగమము (నడయాడునది) స్థావరము(స్థిరము) అను రెఒడు రూపములు గలవని ప్రసిద్ధి. ఈ విషయములోని సూక్షమ్స్కవరూపమును సంగ్రమముగా వివరించెఏఉదును(15) ఆ పర్వతము పశ్చిమ సముద్రము, తూర్పు సముద్రమ9ఉల వరకు వ్యాపించి భూమిన కొలిచే కొలబద్దయా యున్నట్లు ఉన్నది. ఆ సుందరమగు పర్వతము అనుక శ్రేష్ఠవసు‌తులకు నియమై ఉన్నది (16)

ఆ పర్వతము అనేక రకముల వృఓంఉలతో నిండి అనేక శిఖరములతో అతి సుందరముగా నున్నది. సింహము, వ్యాఘ్రము మొదలగు జంతువులు దానయందదు సర్వదా సుఖముగా సంచరించుచుండెను(17) మిక్కిలి దట్టమై మంచుతో నిండి అనేక అద్భుతములతో ఆశ్చర్యమును గొల్పు ఆ పరద్దతమును దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు సేవించుచుందురు. అది శివునకు మిక్కిలిప్రియమగు పర్వతము(18)

మమాత్ములు అచట తపస్సును చేయుదురు. మిక్కిలి పవిత్రమగు ఆ పర్దతము వారిని పవిత్రులను చేయును. ఆపర్వతము నందు తపసస్సు చేయువారికి సిద్ధికలుగల నిశ్చితము, శుభకరమగు ఆ పర్వతము అనెక ధాతువులకు (లోహఖనిజము) నిలయమై ఉన్నది(19) దివ్యమగు రూపము గలది, అన్ని భాగములో సనుందరమైనది, రమణీయమైనది, వికారములు లేనిది, సత్పురుషులకు ప్రియమైనది అగు ఆ శ్రేషణ్ఠపర్వత రాజము విష్ణువు యొక్క అంశచే ఉద్భవించినది (20)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2021

No comments:

Post a Comment