నిర్మల ధ్యానాలు - ఓషో - 155


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 155 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమాజం మనుషుల్లో యాంత్రికతని తెచ్చింది. మానవ అభివృద్ధి కన్నా ఉత్పత్తికే ప్రాధాన్యమిచ్చింది. సౌఖ్యమే శాంతి అంటుంది. ఈ రకమయిన శాంతిని నమ్మేవాడు బుద్ధిహీనుడు. యిట్లాంటి శాంతికి లొంగేవాడు ఆనందాన్ని, ప్రేమని కోల్పోతాడు. 🍀


సమాజం నిన్ను సజీవంగా చూడదలచుకోదు. నిర్జీవంగా చూడదలచు కుంటుంది. నిన్ను చంపి నిన్నొక యంత్రపు పనిముట్టుగా మార్చాలని ప్రయత్నిస్తుంది. సమాజం ఆ విషయంలో విజయం సాధించింది. మనుషుల్లో యాంత్రికతని తెచ్చింది. మానవ అభివృద్ధి కన్నా ఉత్పత్తికే ప్రాధాన్యమిచ్చింది. దాని కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టింది. సౌఖ్యం దైవికమంటుంది. సౌఖ్యమే శాంతి అంటుంది.

ఈ రకమయిన శాంతిని నమ్మేవాడు బుద్ధిహీనుడు. ఇది మృతశాంతి. నిర్జీవశాంతి. యిట్లాంటి శాంతికి లొంగేవాడు స్వేచ్ఛను కోల్పోతాడు. తెలివితేటల్ని కోల్పోతాడు. ఆనందాన్ని, ప్రేమని కోల్పోతాడు. అతనొక బండిచక్రంలో భాగమవుతాడు. ఆ భాగం మార్చవచ్చు. ఒకటి పోతే యింకొకటి ఆ స్థానంలో పెట్టవచ్చు. కారణం వాళ్ళు వ్యక్తులు కారు. మరలు, అన్ని మతాలూ ఈ పద్ధతికి ప్రబోధించాయి. ఇక్కడ గొప్ప కుట్ర దాగుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Mar 2022

No comments:

Post a Comment