మైత్రేయ మహర్షి బోధనలు - 94
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 94 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 77. సద్గురువు -2 🌻
అతడు దేనిని ద్వేషింపడు. యోగులు ద్వేషించిన వారిని అతడు కరుణించును. అతడు మహాత్ములను, సధ్రంథములను సమర్థించునే గాని అపహాస్యము చేయడు. అతని నడత నిర్దిష్టముగను, నిర్దుష్టముగను వుండును. సందిగ్ధ ముండదు. అనుయాయులకు గల అపాయము సూచనప్రాయముగ తెలుపుచునుండును. అతడికి కించిత్ మేలు చేసిన వారి యందు కృతజ్ఞుడై యుండును.
జీవుల హృదయమందు ప్రవేశించగల వాడగుటచే వారి ఉద్దేశ్యములను సులభముగ గ్రహించును. అతడు నిర్భయుడు. అట్లని ఎవరిని నిర్లక్ష్యము చేయడు. అతని పని జీవులను వారి హృదయము లందు మేల్కొల్పుటయే. అట్టి సద్గురువు సాన్నిధ్యమును హృదయమున పెంపొందించు కొనుట నిజమగు సౌభాగ్యము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
26 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment