గీతోపనిషత్తు -135


🌹. గీతోపనిషత్తు -135 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 20

🍀. 18. బ్రహ్మజ్ఞాని - బ్రహ్మమునందు స్థిరబుద్ధి కల బ్రహ్మజ్ఞాని మోహరహితుడై యుండును. ఇష్టమైన దానిని పొందునపుడు సంతోషించుట గాని, యిష్టము లేని దానిని పొందునపుడు దుఃఖించుట గాని చేయడు. బ్రహ్మజ్ఞాని అన్నిటియందు బ్రహ్మమునే దర్శించును. అతని బుద్ధి బ్రహ్మమునందు స్థిరపడి యుండును. అతడు బ్రహ్మ పరాయణుడై యుండునని, బ్రహ్మమునందే నిష్ఠ కలిగి యుండు నని, అన్నింటి యందును బ్రహ్మమునే దర్శించునని, సృష్టి సర్గమును దాటిన దృష్టి కలవాడని ముందు శ్లోకములలో తెలుప బడినది. బ్రహ్మమును దర్శించునపుడు ప్రకృతి విలాసమే యుండును కాని, మాయ ఆవరింపదు. మోహము పొందుట యుండదు. అతడు అసమ్మూఢుడు. మూఢత్వమనిన మోహ పడుట. ప్రకృతి మాయ లేని వానికి మూఢత్వము లేదు, మోహ నత్వము లేదు. మోహమే లేనపుడు ప్రియము లేదు, అప్రియము లేదు. ఇది బ్రహ్మజ్ఞాని లక్షణము. 🍀

న ప్రహృష్యల్షియం ప్రాప్య వోద్విజే క్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధి రసమ్మూథో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః || 20


బ్రహ్మమునందు స్థిరబుద్ధి కల బ్రహ్మజ్ఞాని మోహరహితుడై యుండును. ఇష్టమైన దానిని పొందునపుడు సంతోషించుట గాని, యిష్టము లేని దానిని పొందునపుడు దుఃఖించుట గాని చేయడు. బ్రహ్మజ్ఞాని అన్నిటియందు బ్రహ్మమునే దర్శించును. అతని బుద్ధి బ్రహ్మమునందు స్థిరపడి యుండును.

అతడు బ్రహ్మ పరాయణుడై యుండునని, బ్రహ్మమునందే నిష్ఠ కలిగి యుండు నని, అన్నింటి యందును బ్రహ్మమునే దర్శించునని, సృష్టి సర్గమును దాటిన దృష్టి కలవాడని ముందు శ్లోకములలో తెలుప బడినది. బ్రహ్మమును దర్శించునపుడు ప్రకృతి విలాసమే యుండును కాని, మాయ ఆవరింపదు. మోహము పొందుట యుండదు. అతడు అసమ్మూఢుడు.

మూఢత్వమనిన మోహ పడుట. ప్రకృతి మాయ లేని వానికి మూఢత్వము లేదు, మోహ నత్వము లేదు. మోహమే లేనపుడు ప్రియము లేదు, అప్రియము లేదు. ఇది బ్రహ్మజ్ఞాని లక్షణము. ఇటీవలి కాలమున రామకృష్ణ పరమహంస జీవితము బ్రహ్మజ్ఞానికి దర్పణము పట్టినట్లుండును. సమకాలిక బ్రహ్మ జ్ఞానులు కూడ అతనిని చూచి విస్తుపోయిరి. రామకృష్ణుడు సదా బ్రహ్మమునందే చరించెను.

తానే బ్రహ్మము అయి ఉండుట వలన, తాను బ్రహ్మజ్ఞాని యను స్ఫురణ కూడ తనకు లేదు. బ్రహ్మజ్ఞాను లందరును సభ నేర్పాటు చేసి అతనిని బ్రహ్మజ్ఞానిగ నిర్ణయించినారు. ఆ విషయము పరమహంసకు తెలుపగ ఆ మహాత్ముడు “అంటే ఏమిటి” అని అడిగినాడట. అతడు మురుగు నీటిని కూడ ఆచమనము గావించెడివాడు. శునకముతో సమానముగ కలిసి భుజించెడివాడు. శునక మను భావ మతనికుండక, అదియును బ్రహ్మముగనే గోచరించెడిది. బ్రహ్మజ్ఞాన స్థితి ప్రకృతి స్పర్శ దాటిన స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2021

No comments:

Post a Comment