దేవాపి మహర్షి బోధనలు - 15


🌹. దేవాపి మహర్షి బోధనలు - 15 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 6. గోపాల మంత్రము -2 🌻


'గోపా' శబ్దము, పరిరక్షింపబడి అమృత పానము చేయుచు సామరస్యమును, విజయమును, పొందిన జీవాత్మను సూచించును. గోప, గోపీజనులనగా వీరే. సూర్య చంద్రాత్మక ప్రజ్ఞలుగ సృష్టి వలయమును ఏర్పరచువారు కూడా వీరే.

వీరు పొందు తాదాత్మ్యస్థితిని శబ్దపరముగ ఇంద్రబీజము అయిన 'ల' అను అక్షరముగ ఋషులు తెలిపిరి. పానము, పరిరక్షణము, అమృతత్త్వము, సామరస్యము, విజయము అను గుణములన్నియు 'గోపాల' అను శబ్దమున ఇమిడి యున్నవి. గోపాల మంత్రముచే ఇట్లు తాదాత్మ్యము చెందిన జీవులు ఎందరో కలరు.

శ్రీకృష్ణుని గానము, భజనము, ధ్యానము, స్మరణము చేసిన భక్తులు పరిసరముల ప్రభావము నండి పరిరక్షింపబడుట కృష్ణభావనా పారవశ్యమున జీవించుట ఇందలి రహస్యము.

జగద్గురువగు శ్రీకృష్ణుడు తనను ధ్యానము చేసిన వారందరికీ పై విజయమును అనుగ్రహించు చుండును. జీవుని ప్రయాణమున ప్రతి నిత్యము మాధుర్యము నిండి యుండుట, జీవితము వైభవోపేతముగా ముందుకు సాగుట ఇందలి అద్భుతము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2021

No comments:

Post a Comment