28-JANUARY-2021 EVENING

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 135🌹  
13) 🌹. శివ మహా పురాణము - 335🌹 
14) 🌹 Light On The Path - 88🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 220🌹 
16) 🌹 Seeds Of Consciousness - 284 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 159🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 15 / Lalitha Sahasra Namavali - 15🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 15 / Sri Vishnu Sahasranama - 15 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -135 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 20

*🍀. 18. బ్రహ్మజ్ఞాని - బ్రహ్మమునందు స్థిరబుద్ధి కల బ్రహ్మజ్ఞాని మోహరహితుడై యుండును. ఇష్టమైన దానిని పొందునపుడు సంతోషించుట గాని, యిష్టము లేని దానిని పొందునపుడు దుఃఖించుట గాని చేయడు. బ్రహ్మజ్ఞాని అన్నిటియందు బ్రహ్మమునే దర్శించును. అతని బుద్ధి బ్రహ్మమునందు స్థిరపడి యుండును. అతడు బ్రహ్మ పరాయణుడై యుండునని, బ్రహ్మమునందే నిష్ఠ కలిగి యుండు నని, అన్నింటి యందును బ్రహ్మమునే దర్శించునని, సృష్టి సర్గమును దాటిన దృష్టి కలవాడని ముందు శ్లోకములలో తెలుప బడినది. బ్రహ్మమును దర్శించునపుడు ప్రకృతి విలాసమే యుండును కాని, మాయ ఆవరింపదు. మోహము పొందుట యుండదు. అతడు అసమ్మూఢుడు. మూఢత్వమనిన మోహ పడుట. ప్రకృతి మాయ లేని వానికి మూఢత్వము లేదు, మోహ నత్వము లేదు. మోహమే లేనపుడు ప్రియము లేదు, అప్రియము లేదు. ఇది బ్రహ్మజ్ఞాని లక్షణము. 🍀*

న ప్రహృష్యల్షియం ప్రాప్య వోద్విజే క్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధి రసమ్మూథో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః || 20

బ్రహ్మమునందు స్థిరబుద్ధి కల బ్రహ్మజ్ఞాని మోహరహితుడై యుండును. ఇష్టమైన దానిని పొందునపుడు సంతోషించుట గాని, యిష్టము లేని దానిని పొందునపుడు దుఃఖించుట గాని చేయడు. బ్రహ్మజ్ఞాని అన్నిటియందు బ్రహ్మమునే దర్శించును. అతని బుద్ధి బ్రహ్మమునందు స్థిరపడి యుండును. 

అతడు బ్రహ్మ పరాయణుడై యుండునని, బ్రహ్మమునందే నిష్ఠ కలిగి యుండు నని, అన్నింటి యందును బ్రహ్మమునే దర్శించునని, సృష్టి సర్గమును దాటిన దృష్టి కలవాడని ముందు శ్లోకములలో తెలుప బడినది. బ్రహ్మమును దర్శించునపుడు ప్రకృతి విలాసమే యుండును కాని, మాయ ఆవరింపదు. మోహము పొందుట యుండదు. అతడు అసమ్మూఢుడు. 

మూఢత్వమనిన మోహ పడుట. ప్రకృతి మాయ లేని వానికి మూఢత్వము లేదు, మోహ నత్వము లేదు. మోహమే లేనపుడు ప్రియము లేదు, అప్రియము లేదు. ఇది బ్రహ్మజ్ఞాని లక్షణము. ఇటీవలి కాలమున రామకృష్ణ పరమహంస జీవితము బ్రహ్మజ్ఞానికి దర్పణము పట్టినట్లుండును. సమకాలిక బ్రహ్మ జ్ఞానులు కూడ అతనిని చూచి విస్తుపోయిరి. రామకృష్ణుడు సదా బ్రహ్మమునందే చరించెను. 

తానే బ్రహ్మము అయి ఉండుట వలన, తాను బ్రహ్మజ్ఞాని యను స్ఫురణ కూడ తనకు లేదు. బ్రహ్మజ్ఞాను లందరును సభ నేర్పాటు చేసి అతనిని బ్రహ్మజ్ఞానిగ నిర్ణయించినారు. ఆ విషయము పరమహంసకు తెలుపగ ఆ మహాత్ముడు “అంటే ఏమిటి” అని అడిగినాడట. అతడు మురుగు నీటిని కూడ ఆచమనము గావించెడివాడు. శునకముతో సమానముగ కలిసి భుజించెడివాడు. శునక మను భావ మతనికుండక, అదియును బ్రహ్మముగనే గోచరించెడిది. బ్రహ్మజ్ఞాన స్థితి ప్రకృతి స్పర్శ దాటిన స్థితి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 335 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
84. అధ్యాయము - 39

*🌻. విష్ణుదధీచి యుద్ధము -3 🌻*

దధీచుడు ఇట్లు పలికెను -

హే విష్ణో! ఈ మాయతో గాని మంత్రశక్తితో గాని పని లేదు. నీవు ప్రయత్న పూర్వకముగా యుద్ధమును చేయుము. ఈ మాయను విడిచిపెట్టుము (40).

దేవతలు ప్రతాపశీలియగు దధీచునితో మరల యుద్ధమును చేయగోరి ఆ నారాయణ దేవుని వేగముగా సమీపించిరి (41). ఆ మహర్షి యొక్క మాటలను వివిన విష్ణువు శంభుతేజముతో నిండియున్న మిక్కిలి కోపించెను. అయిననూ ఆయన భయము లేకుండనుండెను (42).

ఇంతలో అచటకు నేను, నాతో బాటు క్షువుడు చేరుకుంటిమి. పద్మ నాభుడగు విష్ణువును, దేవతలను నేను యుద్ధమును చేయుకుండగా వారించితిని (43). ఆ బ్రాహ్మణుని జయింపశక్యముకాదని చెప్పితిని. హరి నా మాటను విని ఆ మహర్షి వద్దకు వెళ్లి నమస్కరించెను (44). క్షువుడు మిక్కిలి దీనుడై దుఃఖియై ఆ దధీచ మహర్షి వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను (45).

క్షువుడిట్లు పలికెను -

ఓ మహర్షీ !శివభక్తాగ్రగణ్యా! దయను చూపుము. ఓ పరమేశ్వర స్వరూపా! ప్రసన్నుడవు కమ్ము. దుర్జనులు నిన్ను కన్నెత్తియై ననూ చూడజాలరు (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ రాజు యొక్క ఈ మాటను విని తపోనిధి, వేదవేత్తయగు దధీచుడు ఆ రాజును, మరియు దేవతలనందరినీ అను గ్రహించెను (47). అపుడాయన విష్ణువు మొదలగు వారిని చూచి మిక్కిలి కోపించినవాడై హృదయములో శివుని స్మరించి విష్ణువును, దేవతలను కూడ శపించెను(48).

దధీచుడిట్లు పలికెను -

దేవతలు, దేవేంద్రుడు, మహర్షులు, విష్ణు దేవుడు, మరియు ఆయన గణములు రుద్రుని కోపమునే అగ్నిచే వినాశమును పొందెదరు గాక! (49).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు దేవతలను శపించి, మహర్షి తరువాత క్షువుని చూచి ఆతనితో నిట్లనెను. ఓ రాజేంద్రా! బ్రాహ్మణోత్తముని దేవతలు, రాజులు కూడ పూజించవలెను (50).ఓ రాజశ్రేష్ఠా! బ్రాహ్మణులే బలవంతులు, సమర్థులు. ఇట్లు స్పష్టముగా చెప్పి ఆ మహర్షి తన ఆశ్రమమును ప్రవేశించెను (51). క్షువుడు దధీచునకు నమస్కరించి తన గృహమునకు వెళ్లెను. విష్ణువు దేవతలతో గూడి వచ్చిన దారిలో తన లోకమునకు వెళ్లెను (52). ఆ స్థానము స్థానేశ్వరమను పేర పుణ్యక్షేత్రము అయెను. స్థానేశ్వరమును చేరి దర్శించిన వారు శివసాయుజ్యమును పొందెదరు (53).

  ఓ కుమారా! నీకు క్షువదధీచుల వివాదమును, త్రిమూర్తులలో శివుడు తక్క మిగిలిన ఇద్దరు అనగా బ్రహ్మ విష్ణువులు పొందిన శాపములను గూర్చి సంక్షేపముగా చెప్పితిని (54). ఈ క్షువ దధీచ వివాదమును నిత్యము కీర్తించు మానవుడు అపమృత్యువును జయించి, దేహమును వీడిన తరువాత బ్రహ్మలోకమును పొందును (55). ఎవరైతే దీనిని కీర్తించి, తరువాత యుద్ధమునకు బయలు దేరునో, వానికి మృత్యు భయము ఉండదు. మరియు ఆతడు విజయమును పొందగలడు (56).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో విష్ణు దధీచి యుద్ధవర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 88 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 6 🌻*

346. There is, however, a side to that which is quite right and true. When people meet with a statement about something which they do not know and cannot verify for themselves, it is a matter of importance to them who said it. They may say: “Dr. Besant makes this statement; I have great reason to believe that she knows all about this matter, consequently I accept her statement.”

After all, that is no more than we do in regard to science. There are many facts in science which we have no means of proving for ourselves, but because certain eminent men have investigated these subjects and have come to certain conclusions we accept them. 

But when we consider a beautiful ethical statement, it does not matter whether it comes from the Bible or the Bhagavad-Gita, the Koran or the Vedas; we should accept it for its worth. It is then a question of the felicity of the expression and the beauty of the idea.

347. Just as we accept things, or try to do so, for what they are worth, so we must try to value our own work at what it is worth, and not think that, because we have done it, it must necessarily be well done.

Most men who can do anything very well know also the imperfections of their work. When a thing is good we should gladly admit that it is so; when we see faults in our own or in anyone else’s work we should not hesitate to say: “I do not agree; I think so-and-so might be better done.” 

It is well to get into the attitude of mind that does not care whence a thing comes if it is a good thing, and also does not hesitate to put aside the evil, even when it comes from oneself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 220 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జైమినిమహర్షి - 5 🌻*

24. అందుకనే భిక్షాటనము చేసుకునేటటువంటి విప్రుడు వేదం చదువుకునేటప్పుడు, వేదంచదువుకుంటూ మూడు ఇళ్ళల్లోనో, అయిదు ఇళ్ళల్లోనో, లేకపోతే ఎనిమిది ఇళ్ళల్లోనో “భవతీ భిక్షాందేహి” అని అడుగుతాడు. 

25. అలా సంపాదించిన దాంట్లో మొత్తం నాలుగు భాగాలు చేస్తాడు. ఆశ్రమవాసులు కూడా అంతే! వాళ్ళుకూడా అలా భిక్షచేసి తెచ్చుకునేదే! మొదటిభాగాన్ని గోవుకు పెడతారు. రెండోభాగం, ప్రక్కన ఎవరయినా భిక్షాటనానికి వెళ్ళనివారు ఉంటే వాళ్ళకు పెడతారు. 

26. మూడోభాగాన్ని బ్రాహ్మణుడిని వెతుక్కుంటూవెళ్ళి ఆయన కాళ్ళమీదపడి ఆయన తీసుకొనేటట్లుగా ప్రార్థించి ఆయనకు ఆ భిక్షటనాన్నం ఇస్తారు. మిగిలిన నాలుగోభాగాన్ని వాళ్ళు తింటారు. తెలివితక్కువవారా వాళ్ళు? “వాళ్ళే భిక్షాటనంచేసి తెచ్చిన భిక్షను ఇతరులకు పెట్టి – దానంచేసి – మిగిలిన దానిని తాము తింటుంటే, రాజువైఉండి నువ్వు దానం చెయ్యక పోవటం ఏమిటి? అని అడిగాడు రాజును జైమిని మహర్షి.

27. “ఈ ఐశ్వర్యం నీదని ఎలా అనుకుంటున్నావు? ఈ ఐశ్వర్యమంతా ప్రజలది, దేశానిది. ప్రతీవాడూ ఈ ఐశ్వర్యంనాది అనుకోవటంవలన దానం అనే విషయం పుడుతున్నదక్కడ. ‘ఏదీ కూడా నాది కాదు’ అనుకోవడంచేత, దానంచేసే అహం భవంతో కాకుండా దానం ఇచ్చేస్తాడు. అడిగినవాడిదే ఇది.

28. ‘ఈ పూట నాఇంట్లో ఇంత బియ్యము ఉందంటే, వచ్చి అడిగి భోజనంచేసే అతిథి ఎవరయితే వస్తారో, నా భాగ్యంచేత ఆ అతిథి తన భోజనం తాను చేసాడు. లేకపోతే ఏమయ్యేది? అతడి ధనం నేను దాచుకుని ఉండేవాణ్ణి!’ అని అనుకోవాలి. అలా ఉండాలి దృక్పథం. అంటే, పరధనం నా దగ్గర ఉన్నట్లు భావిస్తే, నాకు అహంకారం కలుగదు. సహజమైన ఈ విభూతితో – ఈ జ్ఞానంలో ఉన్నవారికి వాళ్ళల్లో దానాహంకారం ఉండదు.

29. ఆర్యధర్మంలో మామూలుగా గృహస్థుడు తన క్షేమంకోరే దానంచేస్తాడు. మోక్షంకోరేవాడు త్యాగంచేస్తాడు. త్యాగంవేరు, దానంవేరు. ఉన్నదాంట్లో ఒకభాగం ఇవ్వటం దానం. ఉన్నదంతా ఇచ్చివేస్తే అది త్యాగం. త్యాగం మోక్షహేతువవుతుంది. దానం పుణ్యహేతువవుతుంది. 

30. పుణ్యంవల్ల మోక్షంరాదు. ఈ జీవుడికి పుణ్యమే ఆవశ్యకత. ఎంతవాడైనాసరే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఈ ఆకలిదప్పులు – అంటే దుఃఖంతో మృత్యువాతపడ్డ తరువాత, అతడు పొందేటటువంటి బాధలు ఏవయితే ఉన్నాయో, అవి అదానదోషంవలనే కలుగుతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 284 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 133. Meditation means to have an objective or hold onto something. You are that something. Just being the being 'I am'. 🌻*

Meditation means to ponder or have your attention focused on some object, image or 'mantra'. You do so till what you have held in meditation disappears, or you can say you the 'subject' and the 'object' merge into a unity. 

When you 'just be' or are in the knowledge 'I am' only, you are both the subject and the object of meditation. It is the 'being meditating on "being"' and as a result both cancel out each other and what remains ultimately is the Absolute.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 159 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 4 🌻*

619. సృష్టిలోని ప్రతిప్రాణి ఫనా-బకాలను కలిగి యున్నట్లే భూమికలలో నున్న వారు కూడా ఫనా-బకా లను కలిగియుండును. కాని వాటి వాటి సంస్కారములను బట్టి అవి తేడాలు కలిగియుండును.

ఉదాహరణము:- హంసతూలికా తల్పమున పరుండిన వాడును, ఱాతి బండ పై పరుండిన వాడైనను లేక ఇద్దరును కలిసి ఓకే పరుపుపై పరుండిన ను ఇద్దరికీ సుషుప్తి - జాగృతులున్నప్పటికీ ఎవరి ఫనా-బకాలు వారివి.

620. బ్రహ్మీభూతుడైన తరువాత, సచ్చిదానంద స్థితి ననుభవించుచు భూమి మీద భగవంతుని దివ్య జీవనము గడుపుటకై సామాన్య మానవుని చైతన్యమునకు క్రిందకి దిగివచ్చి, దానితోపాటు భగవంతుని దివ్య జీవితములో స్థిరపడిన వానిని నిజమైన దివ్యుడు అందరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 15 / Sri Lalita Sahasranamavali - Meaning - 15 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 15. లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా |*
*స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా ‖ 15 ‖ 🍀*

35) లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా - 
కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.

36) స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - 
వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలు గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 15 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 15. lakṣyaroma-latādhāratā-samunneya-madhyamā |*
*stanabhāra-dalanmadhya-paṭṭabandha-valitrayā || 15 ||🌻*

35 ) Lakshya roma latha dharatha samunneya madhyama -   
She who is suspected to have a waist because of the creeper like hairs raising from there

36 ) Sthana bhara dalan Madhya patta bhandha valithraya -   
She who has three stripes in her belly which looks like having been created to protect her tiny waist from her Chest. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 15 / Sri Vishnu Sahasra Namavali - 15 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - రోహిణి నక్షత్ర 3వ పాద శ్లోకం*

* 🍀 15. లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|*
*చతురాత్మా చతుర్వ్యూహః చతుర్థంష్ట్ర శ్చతుర్భుజః|| 🍀* 

🍀 133) లోకాధ్యక్షః - 
లోకాలకు ప్రభువు, త్రిలోకాధిపతి.

🍀 134) సురాధ్యక్షః - 
దేవతలకు ప్రభువు, దేవదేవుడు.

🍀 135) ధర్మాధ్యక్షః - 
ధర్మమునకు ప్రభువు.

🍀 136) కృతాకృతః - 
ప్రవృత్తి, నివృత్తి కర్మజ్ఞానాచారణతో జీవులకు ఫలితములిచ్చువాడు. 

🍀137) చతురాత్మా - 
జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలో కూడా ఆత్మగా వెలుగొందువాడు. 

🍀 138) చతుర్వ్యూహః - 
జీవులలో జ్ఞాన, బల, గుణ, తేజో స్వరూపంతో వ్యూహం రచించువాడు.

🍀 139) చతుర్దంష్ట్రః - 
నాలుగు కోరపళ్లు కలిగిన నృసింహునిగా ధర్మమును కాపాడువాడు. 

🍀 140) చతుర్భుజః -
 నాలుగు భుజములతో, నాలుగు ఆయుధములతో (శంఖ, చక్ర, గదా, పద్మ) విరాజిల్లువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 15 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

*Sloka Rohini 3rd Padam* 

* 🌻15. lōkādhyakṣaḥ surādhyakṣō dharmādhyakṣaḥ kṛtākṛta: |*
*caturātmā caturvyūha ścaturdaṁṣṭra ścaturbhujaḥ || 15 ||🌻*

🌻 133) Lokādhyakṣaḥ: 
He who witnesses the whole universe.

🌻 134) Surākādhyakṣaḥ: 
One who is the overlord of the protecting Divinities of all regions.

🌻 135) Dharmādhyakṣaḥ: 
One who directly sees the merits (Dharma) and demerits (Adharma) of beings by bestwing their due rewards on all beings.

🌻 136) Kṛtākṛtaḥ: 
One who is an effect in the form of the worlds and also a non-effect as their cause.

🌻 137) Caturātmā: 
One who for the sake of creation, sustentation and dissolution assumes forms.

🌻 138) Chaturvyūhaḥ: 
One who adopts a fourfold manifestation.

🌻 139) Chatur-daṁṣṭraḥ: 
One with four fangs in His Incarnation as Nisimha.

🌻 140) Chatur-bhujaḥ: 
One with four arms.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share 
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/     

Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

Join and Share 
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ 

Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  
www.facebook.com/groups/vishnusahasranam/

Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita 
www.facebook.com/groups/bhagavadgeetha/

Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA 
www.facebook.com/groups/yogavasishta/

Join and Share వివేక చూడామణి viveka chudamani 
www.facebook.com/groups/vivekachudamani/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment