శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 192 / Sri Lalitha Chaitanya Vijnanam - 192


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 192 / Sri Lalitha Chaitanya Vijnanam - 192 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖

🌻 192. 'సుఖప్రదా' 🌻

సుఖమును ప్రసాదించునది శ్రీమాత అని అర్థము.

శ్రీమాత తాత్కాలికముగ సుఖములే కాక శాశ్వత సుఖములు కూడ అందించును. తాత్కాలిక సుఖములు తాత్కాలికముగ ఆనందమును అందించును. సుఖము తాత్కాలికమైనపుడు మిగిలిన సమయములలో దుఃఖమే మిగులును, సుఖ దుఃఖములు ఎత్తు పల్లములుగా సామాన్యజీవుల జీవితము సాగుచుండును.

సుఖమునకు కారణము జ్ఞానము. దుఃఖమునకు కారణము అజ్ఞానము. జీవుని యందు సురాసుర సంపత్తి సమన్వయింపకుండుట వలన, దేవతల ప్రజ్ఞ కారణముగ సుఖము, అసురప్రజ్ఞల కారణముగ దుఃఖము కలుగు చుండును.

ద్వంద్వములను అనుభవించుచూ జీవుడు శాశ్వతమగు సుఖములకై పరితపించును. శాశ్వత సుఖము లభించవలెనన్నచో నిర్దిష్టమగు ఒక మార్గమును అనుసరించ వలెను. శ్రీమాత ఆరాధనము కారణముగ ప్రాథమికముగా భక్తి కుదిరిన జీవునకు, జ్ఞాన ఉపాసన కలుగును.

భక్తి జ్ఞానముల సహాయమున నిత్య అనిత్య వివేకము కలిగి ముందుకు సాగును. శాశ్వత విలువలు గల విషయములయందు ఆసక్తి పెరుగుచు, అశాశ్వత విషయములందు ఆసక్తి తగ్గుచునుండును. అప్పుడు అనిత్యము, నశ్వరము అగు విషయములను క్రమముగా విసర్జించును.

అటుపైన శ్రీగురు కటాక్షమున యోగమున ప్రవేశించి ముక్తుడగును. ముక్తుడనగా ఎట్టి బంధములూ లేనివాడు. అతని జీవితమున బ్రహ్మానుభూతియే రసానుభూతిగా సాగును. అది శాశ్వతమగు సుఖానుభూతి. శ్రీమాత అట్టి సుఖమును ప్రసాదించు తల్లి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 192 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Sukhapradā सुखप्रदा (192) 🌻

She confers happiness. When sorrow is removed what remains is happiness. But, She confers eternal happiness by forbidding Her devotees from rebirth.

This is considered as one of the best boons She gives to Her devotees. But She has Her own way of preferring such devotees. Such devotees should have tasted the sweetness (knowing the self is called as sweetness) and the source of sweetness (Taittirīya Upaniṣad II.7). They are ‘ānandī bhavati’ i.e., happy.

Since She acts as per the law of karma-s (refer nāma 187. niratyayā), Her selection of devotees purely depends upon their sādana (practice). For such sādhaka-s alone, She confers happiness that arises out of having no future births.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2021

No comments:

Post a Comment