శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 1 🌻


ఆకాశము ఆదిగా గల జగత్తును ప్రసవించునది అని అర్థము. ఆకాశము అనగా అంతటా వ్యాపించిన వెలుగు. అంతులేని వెలుగు. అది కేవలము కంటికి కనిపించు వెలుగు మాత్రమే కాదు. వెలుగు చీకటుల కావలి వెలుగు. ఈ వెలుగును అదితి అందురు. ప్రధానము అందురు. సృష్టికి మూలమని మూలప్రకృతి అందురు. ఈ వెలుగు నుండియే జగత్తులన్నియు పుట్టినవి. దీని ప్రధాన లక్షణము ఎరుక. ఇదియే ఈశ్వర లేక ఈశ్వరీ తత్త్వము. దీని నుండి ప్రకృతి పురుషులు పుట్టును. అటుపైన మహదహంకారము పుట్టును. వాని నుండి త్రిగుణములు పుట్టును. త్రిగుణముల నుండియే దేవాసురులు, మానవులు, సకల జీవరాసులు పుట్టును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 550. 'Viyadadi jagatprasuh' - 1 🌻


It means that the sky gives birth to the primordial world. Akasha is the all-pervading light. Endless light. It is not just visible light. Light is beyond light and darkness. This light is called Aditi. It's primary. It is the source of creation. All the worlds are born from this light. Its main symptom is awareness. This is the essence of Ishwara or Iswari. From this the man and nature are born. Thereon the great ego is born. From there are born trigunas. Devas, asuras, humans and all living beings are born from trigunas.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment