శ్రీ శివ మహా పురాణము - 539 / Sri Siva Maha Purana - 539


🌹 . శ్రీ శివ మహా పురాణము - 539 / Sri Siva Maha Purana - 539 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴

🌻. కన్యాదానము - 4 🌻


పర్వతము లిట్లు పలికినవి -

ఓ పర్వత రాజా! నీ విపుడు కన్యాదాన కార్యము నందు నిమగ్నుడవు కమ్ము. ఉత్తి మాటలతో నీ కార్యము చెడగలదు. కాన ఈ మాటలేల? మేము సత్యమును పలుకుచున్నాము. ఈ విషయములో విమర్శను కట్టి పెట్టుము. కన్యను ఈశ్వరునకు ఇమ్ము (36).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మిత్రుల వచనములను విని హిమవంతుడు బ్రహ్మగారి పర్యవేక్షణలో తన కుమార్తెను శివునకు ఇచ్చెను (37). ఓ పరమేశ్వరా! ఈ కన్యను నేను నీ కొరకు ఇచ్చు చున్నాను. ఓ సర్వేశ్వరా! నీవు ప్రసన్ననుడవై ఈమెను భార్యగా స్వీకరించుము (38). హిమవంతడు ఈ మంత్రమును చెప్పి మహాత్ముడగు రుద్రునకు ముల్లోకములకు తల్లి, తనకు కుమార్తె యగు పార్వతిని ఇచ్చెను (39). ఈ తీరున హిమవంతుడు పార్వతి చేతిని శివుని చేతిలో ఉంచి మనస్సులో చాల ఆనందించెను. ఆయన కామనలనే మహాసముద్రమును దాటి వేసెను (40).

పరమేశ్వరుడగు కైలాసపతి ప్రసన్నుడై వెంటనే వేదమంత్రమును పఠించి, పార్వతియొక్క పద్మము వంటి చేతిని తనచేతితో పట్టకొనెను (41). ఓ మునీ! శంకరుడు లోకాచారమును ప్రదర్శించువాడై భూమిని స్పృశించి కామస్య క్రోదాత్‌ ఇత్యాది మంత్రమును శ్రద్ధగా పఠించెను (42).

అంతటా మహానందమునిచ్చే మహోత్సవము ఆరంభమయ్యెను. భూమి యందు, అంతరిక్షము నందు, స్వర్గమునందు జయధ్వానములు బయలు దేరెను (43). అందరు ఆనందముతో 'బాగు, నమస్కారము' అనుచుండిరి. గంధర్వులు ఆనందముతో పాడగా అప్సరసలు నాట్యమాడిరి (44).

హిమావంతుని రాజ్యములోని పౌరులు మనస్సులో చాల ఆనందించిరి. గొప్ప మంగళ శబ్దములతో కూడిన మహోత్సవము ప్రవర్తిల్లెను (45). నేను, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు, అందరు వికసించిన ముఖ పద్మములు గలవారై మిక్కిలి ఆనందించితిమి (46).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 539 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴

🌻 The ceremonious entry of Śiva - 4 🌻



The mountains said:—

36. O mountain, be firm and stand by your decision to give your daughter. If you say “No”, you stand to lose. We speak the truth. Do not hesitate. Let the girl be given to Śiva.


Brahmā said:—

37. On hearing the words of his friends, Himavat urged by Brahmā gave his daughter to Śiva.

38. “O lord Śiva, I am giving this girl, my daughter to you as your wife. O lord of all, be pleased to accept her.”

39. Himavat gave his daughter Pārvatī, the mother of the three worlds, to Śiva the great, repeating the mantra “Tasmai Rudrāya Mahate”.

40. Placing the hand of Pārvatī in the hand of Śiva the mountain rejoiced much mentally. He had the satisfaction of crossing the ocean of his ambition.

41. Śiva grasped the lotus-like hand of Pārvatī in his hand repeating the Vedic mantras. Lord Śiva was greatly delighted.

42. Touching the ground and showing the worldly course of action, O sage, Śiva recited the mantra “Kāmasya Kodāt”.[3]

43. There was a great jubilation everywhere that gladdened everyone. Cries of “Victory” rose up in the heaven, the earth and the sky.

44. The delighted people shouted “Well done” and “Obeisance to you”. The Gandharvas sang sweetly with pleasure. The celestial damsels danced.

45. The citizens, the subjects of Himavat rejoiced in their minds. There was great auspicious jubilation.

46. Viṣṇu, Indra, I and the gods were delighted, with the faces beaming like full blown lotuses.


Continues....

🌹🌹🌹🌹🌹


25 Mar 2022

No comments:

Post a Comment