🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
🌻. అధ మండల విధి - 3 🌻
అరకాన్పీతరక్తాభిః శ్యామన్నే మిం తు రక్తతః |
సితశ్యామారుణాః కృష్ణాః పీతా రేఖాస్తు బాహ్యతః. 18
శాలిపిష్టాది శుక్లం స్యాద్రక్తం కౌసుంభకాదికమ్ |
హరిద్రయా చ హారిద్రం కృష్ణం స్యాద్దగ్ధధాన్యతః. 19
శమీపత్రాదికైః శ్యామం బీజానాం లక్షమప్యతః |
చతుర్లక్షస్తు మన్త్రాణాం విద్యానాం లక్షసాధనమ్. 20
అయుతం బుద్ధవాద్యానాం స్తోత్రాణాం చ సహస్రకమ్ |
పూర్వమేవాథ లక్షేణ మన్త్రశుద్తిస్తథాత్మనః. 21
తథాపరేణ లక్షేణ మన్త్రః క్షేత్రీకృతో భవేత్ |
పూర్వసేవాసమో హోమో బీజానాం సంప్రకీర్తితః. 22
పూర్వసేవాదశాంశేన మన్త్రాదీనాం ప్రకీర్తితా |
పురశ్చరణమన్త్రే తు మాసికం వ్రతమాచరేత్. 23
భువి న్యసేద్వామపాదం న గృహ్ణీయాత్ర్పతిగ్రహమ్ |
ఏవం ద్విత్రిగుణన్తెవ మధ్యమోత్తమసిద్ధయః. 24
మన్త్రధ్యానం ప్రవక్ష్యామి యేన స్యాన్మన్త్రజంఫలమ్ |
స్థూలం శబ్దమయం రూపం విగ్రహం బాహ్యమిష్యతే. 25
సూక్ష్మం జ్యోతిర్మయం రూపం హార్దం చిన్తామయం భవేత్ |
చిన్తయా రహితం యత్తు తత్పరం పరికీర్తితమ్. 26
వారాహసింహశక్తీ నాం స్థూలరూపం ప్రధానతః |
చిన్తయా రహితం రూపం వాసుదేవస్య కీర్తితమ్. 27
చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను.
వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును.
బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును.
రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను.
మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.
ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము.
మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము.
వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment