🌹. నారద భక్తి సూత్రాలు - 7͓̽2͓̽ 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41
🌻. 41... తస్మిన్ తజ్జనే భేదాభావాత్ ॥ - 3 🌻
సీ, తనయందు నఫీల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి జేరి నమస్కృతుల్ చేయువాడు
కన్ను దోయికి నన్యకాంతలడ్డంబైన
మాతృ భావము సేసి మరలువాడు
తలి దండ్రుల భంగి ధర్మ వత్సలతను
దీనుల గాన జింతించువాడు
తే. సఖుల యెడ సోదర స్థితి జరుపువాడు
దైెవతములంచు గురువుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుదైన ప్రహ్లాదు డధిప!
తా ప్రహ్లాదుడు సమస్త ప్రాణులు తనవంటివెనని, వాని యందు సమ దృష్టి కలిగి, ఉండెను. పెద్దల యెడల దాసుని వలె వినయశీలుడయ్యెను.
పరస్త్రీల యెడల మాతృభావం కలిగి, అడ్డు తొలగేవాడు. దీనులను తల్లిదండ్రులను చూచినట్లు చూచి, ధర్మ బుద్ధితో ఆదరించేవాడు. సాటి మిత్రులతో సోదరభావంతో మెలగేవాడు. గురువులను దైవ సమానులుగా జూచి, సేవించెవాడు. హాస్వానికైనా అబద్దాలాదెవాడు కాదు. ఈ ప్రహ్లాదుడు ఇటువంటి సత్వగుణ సంపన్నుడు. ఇట్టి ఉపాయం తప్పక భగవదనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది.
ఎల్ల శరీరధారులకు నిల్లను చీంకటి నూతిలోపలం
ద్రైళ్ళక వీరు నే మను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవ
ర్తిలక సర్వము న్నతని దివ్య కళామయ మంచు విష్ణునం
దుల్లముం జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ ॥
-భాగవతం
ఈ విధంగా అద్వితీయ ఆత్మ భావనను బోధిస్తున్నాడు. సర్వమందున్న వాడు, దివ్య కళామయుడు అయిన విష్ణువు గురించి తెలియ జేస్తున్నాడు ఆ ప్రహ్లదుడు.
అజ్ఞల్ కొందరు మెము తామనుచు మాయంజెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాల్బ దురన్వయ క్రమములన్ భాషింపగా నెర రా
జిజ్ఞానా పథమందు మూఢులుగదా చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపగా నేర్తురే ॥
-భాగవతం
భగవత్తత్తాన్ని కేవలం తెలివితో, వాదంతో తెలుసుకొనడం అసాధ్యం. అలాగైతే వేదవెత్తలైన బ్రహ్మాది దెవతలు ఆ పురుషోత్తముని గ్రహించె వారే కదా! కాని ఆ తత్త్వం దేవతలకు కూడా అందనిది.
ఇక రాక్షస స్వభావంగల వారెట్లు దర్శించగలరు? అయితే నావంటి భక్తుల చిత్తం కరిగి హృషికేశుని సన్నిధిలో కలుస్తున్నది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత వాన విశేషమత్తమైన భక్తునికి, భగవంతునికంటె అన్యత లెదు. అనన్యమెనని నిశ్చయం. ఈ విధంగా ప్రహ్లాదుడు తన తండ్రికి బోధించెను. ఇంకను ఇట్లు పలికెను.
కలడంబోధి గలండు గాలిన్ కల దాకాశంబునం గుంభినిం గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలడోంకారమునం ద్రిమూర్తులం ద్రైలింగవ్యక్తులం దంతటం గల దీశుండు గలండు తండ్రీ ! వెదకంగా నేలయీ యా యొదన్
-భాగవతం
పాలింపుము శేముషి - నున్మూలింపుము కర్మ బంధముల సమదృష్టిన్ చాలింపుము సంసారము - కీలింపుము హృద యమందు కేశవ భక్తిన్ అని అద్భుతమైన సలహా ఇచ్చాడా ప్రహ్లాదుడు తన తండ్రికి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment