శ్రీ శివ మహా పురాణము - 203


🌹 . శ్రీ శివ మహా పురాణము - 203 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

45. అధ్యాయము - 20

🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 2 🌻

విష్టంభోsష్టాభిరగమదఎ్టాభిశ్చంద్రతాపనః |మహాకేశస్సహస్రేణ కోటీనాం గణపో వృతః || 15
కుండీ ద్వాదశభి ర్వాహస్తథా పర్వతకశ్శుభః | కాలశ్చ కాలకశ్చైవ మహాకాలశ్శతేన వై || 16
అగ్ని కశ్శతకోట్యావై కోట్యా భిముఖ ఏవ చ | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథ చైవ ధనావహః || 17
సన్నాహశ్చ శతేనైవ కుముదః కోటిభిస్తథా | అమోఘః కోకిలశ్చైవ కోటి కోట్యా సుమంత్రకః || 18
కాకపాదోsపరష్షష్ట్యా షఎ్టా్య సంతానకః ప్రభుః | మహాబలశ్చ నవభిర్మధుబపింగశ్చ పింగలః || 19

విష్టంభుడు ఎనిమిది, చంద్ర తాపనుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (15),

కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనువారు ఒక్కొక్కరు పన్నెండు, మహాకాలుడు వంద (16),

అగ్నికుడు వంద, అభిముఖుడు, ఆదిత్యమూర్దుడు, ధనావహుడు ఒక్కొక్కటి (17),

సన్నాహుడు వంద, కుముదుడు వంద, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి (18),

కాకపాదుడను వాడు అరవై, సంతానకుడను గణపతి అరవై, మహాబలుడు, మధుపింగుడు, పింగలుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణములతో వచ్చిరి (19).

నీలో నవత్యా దేవేశం పూర్ణ భద్రస్తథైవ చ | కోటీనాం చైవ సప్తానాం చతుర్వక్త్రో మహాబలః || 20
కోటికోటి సహస్రాణాం శతైర్వింశతిభిర్వృతః | తత్రాజగామ సర్వేశః కైలాసగమనాయ వై || 21
కాష్ఠాగూఢశ్చ తుష్షఎ్టా్య సుకేశో వృషభస్తథా | కోటి భిస్సస్తభిశ్చైత్రో నకులీశస్స్వయం ప్రభుః || 22
లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకః ప్రభుః | దేవో భృంగీ రిటిశ్ర్శీమాన్‌ దేవదేవప్రియస్తథా || 23
అశనిర్భానుకశ్చైవ చతుష్షఎ్టా్య సనాతనః | నందీశ్వరో గణాధీశశ్శత కోట్యా మహాబలః || 24

నీలుడు తొంభై, పూర్ణ భద్రుడుకూడ తొంభై, మహాబలశాలియగు చతుర్వక్త్రుడు ఏడు కోట్ల గణములతో శివుని వద్దకు వచ్చిరి (20).

సర్వేశ్వరుడగు శివుడు కైలాసమునకు వెళ్లుటకై ఇరువది వందల కోటి కోట్ల గణములతో కూడి బయలుదేరెను (21).

కాష్ఠాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలగు, చైత్రుడు, నకులీశుడు (22),

లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగి దేవుడు, శివునకు అతి ప్రియుడగు శ్రీమాన్‌ రిటి (23),

అశని, భానుకుడు ఒక్కొక్కరు ఏడు, సనాతనుడు అరవై నాలుగు, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి వంద కోట్ల గణములతో విచ్చేసిరి (24).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment