భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 9 🌻

50. భగవంతుణ్ణి ఆర్యుడు ఆరాధించేటప్పుడు – ఆరాధ్యవస్తువుగా భగవంతుణ్ణి మాత్రమే ఎందుకు గుర్తించాడంటే, నాలుగో పురుషార్థమయిన మోక్షాన్ని కేవలం పరమేశ్వరుడే ఇవ్వగలడనే నమ్మకంవలన! అందువల్లనే ఈశ్వరుడు పరమపూజ్యుడయ్యాడు.

51. అటువంటి నివృత్తి, మోక్షము బ్రహ్మదేవుడివ్వటంలేదు. దానికేదో శాపాలు అవీ కల్పించబడ్డాయి పురాణాలలో. కాని యథార్థంగా బ్రహ్మయొక్క లక్షణమే ఇది. గాధలు ఎవరైనా కల్పించవచ్చు. బ్రహ్మయొక్క ప్రవృత్తి సృష్టిచేయటమే! అదే ఆయన కార్యం. సృష్టిలో పంచభూతములలో దేహాత్మభావనతో జీవుడు ఉండడమనేది బ్రహమ ఉద్దేశ్యం. సత్కర్మలాచరించి, ఇక్కడ సుఖాలున్నాయి, అక్కడ స్వర్గముంది, ఇక్కడ నరకముంది – జాగ్రత్తగా ఉండమని తెలుపుతుంది బ్రహ్మయొక్క ఈ ప్రవృత్తి మార్గం. మోక్షవిషయం దాని తరువాతిది.

52. ఈ యజ్ఞాదిక్రతువులన్నీకూడా బ్రహ్మముఖము నుంచీ వచ్చి, వేదములు ప్రతిపాదించినటువంటి త్రిగుణములతో కూడినటువంటివి. కర్మలు జ్ఞాన స్వరూపములుకావు. సుగునాత్మకమైన వేదములచేత ప్రతిపాదించబడినవి! వేదకర్మలెప్పుడూ కోరికలకు ఫలములు ఇచ్చేవే. ఎవడైనా కేవలం జ్ఞానం కోసమే వీటిని ఆచరిస్తున్నాడనేది నిజం కాదు.

53. శంకరులు చెప్పిన శ్రుతివాక్యములు, ఉపనిషద్వాక్యములు ఎక్కువగా ఉన్నాయి. శృతులలోంచి కొన్నివాక్యములు, బ్రాహ్మణములలోంచి కొన్ని వాక్యములను ఆయన తీసుకున్నారు.

54. ‘కర్మబ్రహ్మస్వరూపిణే’ అంటూ అగ్నిహోత్రుడికి రోజూ నమస్కారం చేస్తున్నాం కదా! బ్రహ్మ కర్మస్వరూపుడు అంటే, కార్యబ్రహ్మస్వరూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు. ‘కర్మలో నిర్గుణమయిన బ్రహ్మస్వరూపుడని కాదు’. ‘కార్యబ్రహ్మలోంచీ వచ్చిన వేదసమ్మితమైనటువంటి కర్మస్వరూపుడివి – అగ్నిహోత్రుడివి నీవు – నీకు నమస్కారం. నాకు ఐశ్వర్యం ఇయ్యి. ఆరోగ్యం ఇయ్యి’ అని ప్రార్థిస్తాం.

55. అంటే నిర్గుణమైన బ్రహ్మవస్తువైతే, ఇవన్నీ ఎలా అడుగుతాము? వైదికకర్మలన్నీ సగుణమైనవే. మన ప్రార్థన అంతా లౌకికమే! యజ్ఞమూ లౌకికమే! జ్ఞానంకోసం కాదు. ‘నిస్త్రైగుణ్యో భవార్జున!’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అన్నమాటలకు – త్రిగుణములకూ అతీతుడవుకమ్మనే అర్థం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment