సాధన చతుష్ఠయ సంపద :-
నాల్గు సాధనాలు ఒక సంపదలాంటివి. లౌకిక ప్రపంచంలో సంపద మనకుంటే దాన్ని ఎలాగైనా వినియోగించుకొని ఆనందాన్ని సుఖాన్ని పొందుతాం. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఈ నాల్గు సాధనాలనే సంపద గనుక ఉంటే దాని ద్వారా శాశ్వతానందమును - లేదా మోక్షమును పొందేందుకు చేయవలసిన సాధనలను, పొందవలసిన జ్ఞానాన్ని పొందగలుగుతాం.
వేదాంత జ్ఞానాన్ని పొందాలంటే ఈ సాధన చతుష్ఠయసంపద శిష్యునిలో తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఉపనిషత్తులు 'అధ' అనే శబ్ధంతో ప్రారంభిస్తారు. అధాతో బ్రహ్మజిజ్ఞాసా (బ్ర.సూ.) ---- అధ అశ్వలాయనో భగవంతం (కై.ఉ.)---- ఇక్కడ అధ అంటే 'ఇక' అని అర్థం. అంటే సాధన చతుష్ఠయం సంపాదించిన సాధకుడు ఇక తర్వాత చేయవలిసిన దాన్ని చెపుతున్నారన్నమాట.
ఈ లక్షణాలను ప్రతివారూ తమలో ఉన్నాయో లేదో చూసుకొని వాటిని వృద్ధి చేసుకొనుటకు ప్రయత్నించాలి. ఇవి ఒక దానికొకటి Link అయి ఉన్నాయి. కనుక ఏ ఒక్కదాన్నో పట్టుకుంటే మిగతావన్నీ అలవడతాయి -
(1) వివేకిన :- వివేకం అంటే తెలివి. ఏం తెలివి? నిత్యవస్తువేదో - అనిత్యవస్తువేదో తెలుసుకొనే తెలివి. లౌకిక ప్రపంచంలో కూడా వస్తువులను ఏరుకొనేటప్పుడు ఇది కాస్త ఎక్కువకాలం మన్నిక గలది అని - ఇది వెంటనే చెడిపోయేదని తెలుసుకుంటాం. ఆ తెలివి మనకు ఉంది. లౌకిక వస్తువుల పట్ల మనకున్న ఈ తెలివియే అంతరంగాన్ని శోధించినప్పుడు వివేకం అవుతుంది. ఈ తెలివివల్ల అనిత్యమైన దానిని వదులుకుంటాం. నిత్యమైనదానిని పట్టుకుంటాం. అలాగే ఈ ప్రాపంచిక వస్తువులు - విషయాలు - భోగాలు - ఇవన్నీ అనిత్యం. నిత్యమైనది ఆత్మ ఒక్కటే అని గ్రహించి అన్నింటిని "వదలి" ఆత్మవస్తువును పట్టుకోవాలి. అందుకోసమే ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఉపయోగపడుతుంది. ఇటువంటి వివేకం ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారికి తప్పక ఉండాలి. - బ్రహ్మ సత్యం జగన్మిధ్య - అనేది ఎల్లప్పుడూ బుద్ధిలో స్థిరంగా ఉండాలి.
(2) వైరాగ్యం :- వివేకంతో అనిత్యమైన - మిధ్య ఐన వాటిని తెలుసుకున్నప్పుడు ఇక వాటిపట్ల వైముఖ్యం మనలో ఏర్పడుతుంది. అవి మనకు అంత ప్రధానమైనవి కాదని, మనకు శాశ్వత సుఖాన్ని, సంతోషాన్ని కలిగించ లేవని నిశ్చయంగా గ్రహించినప్పుడు మనలో కలిగే మానసికమైన మార్పే వైరాగ్యం. వైరాగ్యం అంటే వ్యర్థ జీవితాన్ని గడపటం కాదు. మృత తుల్యమైన జీవితం గడపటం కాదు. పరమ ప్రశాంతంగా - ఎటువంటి అలజడులు లేకుండా జీవించటమే. జీవితం నుండి పారిపోవటం కాదు. ఈ జీవితాన్ని తిరస్కరించటం. వివేకం అనే పుష్పం వికసిస్తేనే వైరాగ్యం అనే ఫలం వస్తుంది. అలాగాక మరొక విధంగా కలిగే వైరాగ్యం నిలకడ గలిగినది కాదు. అది పైపై వైరాగ్యమే అవుతుంది - వివేకం ఎంత గట్టిగా ఉంటే వైరాగ్యం అంత గట్టిగా ఉంటుంది. నా నీడ నేను కాదని - తెలిసినప్పుడు దానికేమైనా నాకేం ఫరవాలేదు - ఎవడన్నా తుపాకీతో పేల్చినా - నాకేం? ---
(3) శమాది గుణశాలినః :- ఎవరిలో వివేకం - తద్వారా వైరాగ్యం కలిగిందో వారిలో ప్రశాంతమైన - స్వాధీనమైన - అలజడులు లేని మనస్సు ఉంటుంది. అదే శమం. ఇంద్రియాలు కూడా భోగాలకై పరుగులు తీయవు అదే దమం. ఎదురుగా వస్తువులున్నా అవి మనస్సులో ఎట్టి అలజడి కలిగించలేవు. అదే ఉపరతి. అన్నింటిని ఓర్చుకునే స్వభావం ఏర్పడుతుంది. అదే తితిక్ష. భగవంతుని మీద - శాస్త్రాల మీద - గురువుల మీద నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. అదే శ్రద్ధ. చిత్తం ఏకాగ్రమై పరమాత్మ పైనే నిలుస్తుంది - అదే సమాధానం.
(4) ముముక్షుత్వం :- చివరగా చెప్పినా ఇదే మొదటిది - బంధనంలో ఉన్నాననుకున్నవాడే విడుదల పొందాలనుకుంటాడు. సర్వ బంధనాల నుండి విముక్తి పొంది జన్మరాహిత్యాన్ని పొంది మోక్షాన్ని అందుకోవాలనే తపన అన్నింటికన్న అతిముఖ్యమైన అర్హత - ఈ పై సంపదలు ఉన్నవాడే అర్హత పొందిన వాడు, బ్రహ్మ జిజ్ఞాస పొందగల అర్హత సాధించినవాడు.
ఆధ్యాత్మికరంగంలో ప్రగతి సాధించాలంటే - ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే - సాధన సిద్ధించాలంటే ప్రతి సాధకునిలోను 4 ముఖ్య అర్హతలు - లక్షణాలు ఉండాలి.
అవే (i) నిత్యానిత్యవస్తువివేకం, (ii) ఇహాముత్రార్ధ ఫలభోగవిరాగం (iii) శమాది షట్కసంపత్తి (iv) ముముక్షుత్వం)
ఇవి ఉంటేనే ప్రగతి - విజయం - లేకపోతే సిద్ధిలేదు. మనం ఈ మార్గంలో కృషి చేస్తున్నప్పుడు - ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏమాత్రం ముందుకు వెళ్ళటం లేదు అనుకున్నప్పుడు - ఒక్కసారి వెనక్కు తిరిగి మన అర్హతలను నిశితంగా పరిశీలించుకోవాలి. మనలో ఏ మేరకు ఈ లక్షణాలున్నాయో - ఎక్కడ లోపాలున్నాయో గమనించాలి. వాటిని సరిచేసుకొని - సాధన చేసుకొని ముందుకు సాగాలి.
మనం కొత్త కారులో ప్రయాణం చేస్తున్నాం. అది ఒకచోట ఆగిపోయింది. మనం దిగి ఎందుకు ఆగిందో పరిశీలించాలి. ఏ పార్టు సరిగ్గా పనిచేయటం లేదో - లేక Driving లో ఏదైనా పొరపాటు చేశామో చూసుకోవాలి.
మనం జబ్బు చేసి డాక్టరు దగ్గర కెళ్ళాం. ఆయన పరీక్షించి - మందులు వ్రాసిచ్చాడు. వాడాం, కాని ప్రగతి కనిపించలేదు - లోపం ఎక్కడుందో చూడాలి. వాడమన్న మోతాదు వాడుతున్నామా? భోజనానికి ముందు వేసుకోమన్నవి అలాగే వేసుకుంటున్నామా? పత్యం సరిగ్గా పాటిస్తున్నామా? అని తెలుసుకొని లోపాలు సరిచేసుకోవాలి. డాక్టరును సంప్రదించాలి.
అలాగే చదువుకొనే విద్యార్థి కొన్ని నియమాలు పాటిస్తేనే పరీక్షలలో విజయం సాధిస్తాడు.
(i) ప్రతిరోజూ స్కూలుకు వెళ్ళాలి.
(ii) శ్రద్ధతో ఏకాగ్రతతో పాఠాలు వినాలి.
(iii) విన్నవాటిని బాగా చదువుకోవాలి.
(iv) వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి.
(v) పరీక్షలలో అడిగిన వాటికి సరైన సమాధానాలు వ్రాయాలి.
నీవు pass కాలేదంటే ఎక్కడో లోపం జరిగింది. దానిని సరిచేసుకోవాలి.
ఇలా లౌకికమైన విషయాల్లో ఎలాగైతే విజయానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆధ్యాత్మిక రంగంలో కూడా విజయానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
శాస్త్రాన్ని విని, దాని భావాన్ని సరిగ్గా గ్రహించాలన్నా - గ్రహించిన శాస్త్ర సారాన్ని జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకోవాలన్నా కొన్ని అర్హతలు - సాధన చతుష్టయం ఉండాలి. మనకు ప్రగతి కనిపించక పోయినా - అశాంతి కలిగినా - నిరాశా నిస్పృహలు కలిగినా ఎక్కడో లోపం ఉన్నట్టు. అప్పుడు మన అంతరంగాన్ని చూసుకోవాలి. తనను తాను పరిశీలించుకుని సరి చేసుకోవాలి. అప్పుడే ప్రగతి - ఈ అర్హతలను మహాత్ములు తమ అనుభవంతో నిర్ణయించారు. కనుక సాధకుడికి ఇది రక్షా కవచం. దీనిని ధరించి ప్రయాణం చేయాలి.
సేకరణ : శ్రీ ఆదిశంకరాచార్యులవారి 'వివేకచూడామణి'

No comments:
Post a Comment