నిర్మల ధ్యానాలు - ఓషో - 55


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 55 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ ధ్యానం చప్పుడును నువ్వు తెలుసుకుంటే రూపాంతరం చెందుతావు. అదో కొత్త జన్మ, నిజమైన జన్మ. అపుడు ఆ క్షణం నువ్వు శరీరం కాదని, మనసు కాదని, స్వచ్చమైన చైతన్యమని తెలిసివస్తుంది. 🍀


చైతన్యంతో వున్న మనిషిని, ధ్యానంతో వున్న మనిషిని ఏదీ దారి మళ్ళించ లేదు. కారణం అతను అన్నిట్నీ పరిశీలిస్తాడు. ఫోను శబ్దాన్ని, పసిబిడ్డ అరుపును, పక్కింటి వాళ్ళ మాటల్ని, సౌండు పెరుగుతున్న వాళ్ళ రేడియో శబ్దాన్ని వింటాడు. దాంతో అతనికేమీ అవసరం లేదు. అతను నిశ్శబ్దంగా, నిర్మలంగా వుంటాడు. అన్ని దిశలకూ తలుపులు తెరిచి వుంటాడు. ఏమి జరిగినా, ట్రైన్ శబ్దాన్ని, విమానం శబ్దాన్ని, కోకిల పాటను అన్నిట్ని వింటాడు. ఏదీ అతన్ని ఆటంకపరచదు. అట్లా వింటూ పోతూ వుంటే తనని తడుతున్న చప్పుడుని అతను గుర్తిస్తాడు.

నీ ధ్యానం చప్పుడును నువ్వు తెలుసుకుంటే రూపాంతరం చెందుతావు. అదో కొత్త జన్మ, నిజమైన జన్మ. అపుడు ఆ క్షణం నువ్వు శరీరం కాదని, మనసు కాదని, స్వచ్చమైన చైతన్యమని తెలిసివస్తుంది. ఆ స్వచ్ఛమైన చైతన్యం నీ పుట్టుకకు ముందు వుంది. నీ మరణానంతరం వుంటుందని గ్రహిస్తావు. అదే శాశ్వతత్వం. అదే అనంత ఆవిష్కారం. మరణం లేని దాన్ని కనిపెట్టడమంటే శాశ్వతత్వాన్ని కనిపెట్టడమే.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


8 Aug 2021

No comments:

Post a Comment