నిర్మల ధ్యానాలు - ఓషో - 30


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 30 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. గతాన్ని వదులుకుంటే అనంతానికి, శాశ్వతత్వానికి తలుపులు తెరుస్తావు. 🍀


ధైర్యమంటే ఏమిటి? దానికి విశిష్టమయిన అర్థాన్ని యిస్తే ధైర్యమంటే మనకు పరిచితమైన దాన్ని, తెలిసిన దాన్ని వదులుకునే సామర్థ్యం. ఎందుకంటే మనసంటే అదే. పరిచితమైంది. తెలిసింది. గతం. నువ్వొకసారి గతాన్ని వదులుకుంటే అనంతానికి, శాశ్వతత్వానికి తలుపులు తెరుస్తావు.

కానీ అట్లా సిద్ధపడడానికి మనిషి భయపడతాడు. అనంత శూన్యంలో అన్నీ కోల్పోతానని ఆందోళనకు గురవుతాడు. మనసు చాలా చిన్న విషయం. అది సుఖంలో వుంటుంది. చిన్ని పురుగు. అది బంగారు పంజరం లాంటిది. అది అందంగా వుంటుంది. నువ్వు దాన్ని అలంకరించవచ్చు. ప్రతి ఒక్కరూ దాన్ని అలంకరించడానికి ప్రయత్నిస్తారు.

మన విధ్యా విధానమంతా అదే. ఆ బంగారు పంజరాన్ని ఎంత అందంగా అలంకరిస్తారంటే దాంట్లోంచి బయటపడడం దాదాపు అసాధ్యం. దానికి అతుక్కుపోతావు. నీకు రెక్కలున్న సంగతి మరచిపోతావు. అనంత ఆకాశం నీకు ఆహ్వానం పలుకుతోంది. నువ్వు నక్షత్రాల కేసి సాగవచ్చు. నీ ముందు ఎంతో దూరం పరచుకుని వుంది.

అందువల్ల ధైర్యంగా బంగారు పంజరమనే మనసును వదిలిపెట్టి అజ్ఞాతమైన దాని కేసి, తెలియని దానికేసి వెళ్ళగలగడమే సాహసం. అన్ని భయాల్ని, అన్ని భ్రమల్ని, భద్రతల్ని వదలిపెట్టి వెళ్ళడం అట్లాంటి లక్షణాలున్న వ్యక్తి మాత్రమే మతమున్నవాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jun 2021

No comments:

Post a Comment